జర్నలిస్టు యాంకర్ స్వేచ్ఛ ఇకలేదు
జర్నలిస్టు యాంకర్ స్వేచ్ఛ ఇకలేదు..!!
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...
జర్నలిజంలో ఎంతో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం..తెలంగాణా ఉద్యమంలో పోరాడిన జర్నలిస్ట్ ఆమె.పీడిత జనం స్వేచ్ఛ కోసం తన అక్షరాయుధంతో యుద్ధం చేసిన ధీర వనిత..
ప్రముఖ ఛానెల్లో పని చేస్తున్నపుడు ఆ ఛానెల్ ని తెలంగాణలో నిలిపివేస్తే ఏకంగా అప్పటి సీఎం కేసీయార్ ఇంటి ముందు ధర్నా చేసిన గొప్ప జర్నలిస్ట్..కానీ ఒక నీచుడి వేధింపుల కారణంగా ఆమె ఆ ఛానెల్ లో మంచి పొజిషన్ ను కాస్తా వదులుకుని బయటకు రావాల్సి వచ్చింది..
జర్నలిజాన్ని ప్రాణంగా భావించే స్వేచ్ఛ..ఇక లేదంటే నమ్మలేకపోతున్నాను.ఇది నిజం కాదు అబద్ధం అయితే బావుండు అని కోరుకుంటున్నాను..స్వేచ్ఛకు జోహార్లు..!!
Comments
Post a Comment