క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈ నేల 9న లాటరీ
క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈ నేల 9న లాటరీ
-- ఆర్కేసిఓఏ క్లబ్లో ఆర్డీవో పర్యవేక్షణలో లాటరీ పద్ధతి
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నంబర్ లు(2 బిహెచ్కె)లాటరీ పద్ధతిలో ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు మందమర్రి తహసిల్దార్ పి.సతీష్ కుమార్ శర్మ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..బుదవారం ఉదయం 10:15 గంటల నుంచి మంచిర్యాల ఆర్డీవో పర్యవేక్షణలో మందమర్రి తహసీల్దార్(ఎంఆర్ఓ)ద్వారా పోచమ్మ బస్తీ,అంబేద్కర్ అంగడి బజార్ సమీపంలోని ఆర్‌కేసీఓఏ క్లబ్(సింగరేణి క్లబ్)లో నిర్వహించబడుతుందని సోమవారం ప్రకటించారు.అయితే కేవలం లబ్దిదారులను మాత్రమే ఆ లాటరీ నిర్వహించే ప్రాంగణంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.ఆ నేపద్యంలోనే లబ్ధిదారులు తహసిల్దార్ కార్యాలయం ఇష్యూ చేసిన స్లిప్ తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డ్/ఓటర్ కార్డ్ లేదా ఇతర గవర్నమెంట్ గుర్తింపు
పొందిన కార్డులలో ఏదో ఒకటి వెంట తీసుకొని రావాలని తెలిపారు.
Comments
Post a Comment