క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించారు
క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించారు
-- ఆర్కేసిఓఏ క్లబ్లో మంచిర్యాల ఆర్డీవో పర్యవేక్షణలో కేటాయించారు
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : క్యాతనపల్లి మున్సిపాలిటీలో 230 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నంబర్లు(2 బిహెచ్కె)లాటరీ పద్ధతిలో బుధవారం లబ్ధిదారులకు కేటాయించారు.ఆ క్రమంలో చూస్తే..బుదవారం ఉదయం నుంచి మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసులు
పర్యవేక్షణలో మందమర్రి తహసీల్దార్(ఎంఆర్ఓ)పి.సతీష్ కుమార్ శర్మ క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,ఆర్ అండ్ బి అధికారినీ,ఆర్ఐలు ద్వారా విద్యార్థినిలచే లాటరీ తీపించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సంబంధిత లబ్ధిదారులకు కేటాయింపు చేశారు.ఆ సందర్భంగా మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.అయితే స్థానికంగా ఉన్న 286 ఇండ్లకు 230 ఇండ్లు కేటాయించినట్లు ప్రకటించారు.ముందుగా వికలాంగులకు13 మందికి ఆ ఇండ్లను కేటాయించారు.ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది.ముఖ్యంగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రెండవ దఫాలో మరోసారి చేపట్టిన కార్యక్రమంలో సంబంధిత అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్,ఎమ్మార్వో పి.సతీష్ కుమార్ శర్మ,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి,ఆర్కేపి ఎస్సై జి.రాజశేఖర్,సంబంధిత అధికారులు,మందమర్రి రెవెన్యూ సిబ్బంది,లబ్ధిదారులు
పాల్గొన్నారు.
Comments
Post a Comment