కొవిడ్ వ్యాక్సిన్లతో మరణాలకు సంబంధం లేదు-కేంద్రం కీలక ప్రకటన
కొవిడ్ వ్యాక్సిన్లతో మరణాలకు సంబంధం లేదు-కేంద్రం కీలక ప్రకటన
---- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్....
కొవిడ్ అనంతరం మరణాలకు టీకాతో సంబంధం లేదని ఐసీఎంఆర్,ఎయిమ్స్ వెల్లడించాయి.ఆ క్రమంలో చూస్తే..కరోనా అనంతరం మరణాలు సంభవించడంపై ఈ సంస్థలు పరిశోధన నిర్వహించి వీటికి టీకాతో సంబంధం లేదని వివరించాయి.మునుపటి ఆరోగ్య పరిస్థితుల ప్రభావమే మరణాలకు గల కారణాల్లో కీలక అంశమని తెలిపాయి.ఆ కొవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారు కూడా గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు.ఆ నేసథ్యంలోనే ఐసీఎంఆర్,ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టి కీలక విషయాలను తెలిపాయి.ఆ మేరకు వాటి అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ)ఎయిమ్స్ పరిశోధనలు చేపట్టాయి.2023 మే ఆగస్టు మధ్య19 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వేను నిర్వహించాయి.ఆరోగ్యంగా కన్పించినప్పటికీ 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి మధ్య అకస్మాత్తుగా మరణించిన వారి డేటాను పరిశీలించాయి.వాటిని అధ్యయనం చేసిన తర్వాత సంబంధిత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వివరించాయి
Comments
Post a Comment