ఆర్కేపీలో జూనియర్ రాష్ట్రస్థాయి గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు ఉత్సాహభరీతంగా సాగుతున్నాయి
ఆర్కేపీలో జూనియర్ రాష్ట్రస్థాయి గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు ఉత్సాహభరీతంగా సాగుతున్నాయి
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ పోటీలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి.ఆ క్రమంలో చూస్తే..రెండో రోజు స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ లీగ్ మ్యాచెస్ లో మెదక్ తో రంగారెడ్డి టీం 0- 7 తేడాతో, ఆదిలాబాద్ తో నిజామాబాద్ టీం 0-3 తేడాతో గెలిచింది. ఖమ్మం తో నల్గొండ (0-0),వనపర్తి తో మహబూబ్ నగర్ (0-0) డ్రా గా ముగించాయి.లీగ్ స్టేజి లో గెలిచిన ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి 8 టీమ్స్ క్వార్టర్ ఫైనల్ చేరగా గురువారం మధ్యాహ్నo నుంచి క్వార్టరఫైనల్స్ లో
1.నల్గొండ vs మహబూబ్ నగర్
2.నిజామాబాద్ vs గద్వాల్
3.రంగారెడ్డి vs ఆదిలాబాద్
4.వనపర్తి vs ఖమ్మం జట్లు తలపడనున్నాయి.
క్వార్టర్ ఫైనల్ రిజల్ట్స్
1.నల్గొండ vs మహబూబ్ నగర్ (0-0) పెనాల్టీ షూటౌట్ (2-1)
2.నిజామాబాద్ vs గద్వాల్ (4-0)
3.రంగారెడ్డి vs ఆదిలాబాద్ (4-0)
4.వనపర్తి vs ఖమ్మం జట్లు (0-1)
సెమీ ఫైనల్ దశకు చేరుకున్న ఫుట్ బాల్ ఛాంపియన్షిప్
రేపు శుక్రవారం సెమిఫైనల్ లో
1.నిజామాబాద్ vs నల్గొండ
2.ఖమ్మం vs రంగారెడ్డి జట్లు
తలపడనున్నాయి.
Comments
Post a Comment