మావోయిస్టులు లచ్చన్న,ఆంకుభాయి రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు

మావోయిస్టు రాష్ట్ర సభ్యుడు లచ్చన్న,ఆంకుభాయి రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు





- లొంగిపోయిన మావోయిస్టులకు పున:రావాసం కల్పిస్తాం.. 

-- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 

రామగుండం కమిషనరేట్ ఆఫీస్,జులై-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా ఎదుట మంగళవారం మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, డీసీఎంలు లొంగిపోయారు.ఆ క్రమంలో చూస్తే..నాలుగు దశాబ్దాలపాటు సిపిఐ మావోయిస్టులో పనిచేసిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న,ఎస్ సీఎం చౌదరి ఆంకుభాయి డీసీఎంలు లొంగిపోయారు.అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్,కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని సిపి కోరారు.లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తామని ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని,కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేటు కార్యాలయంలో లొంగిపోయారు.లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.1ఆత్రం లచ్చన్న(65)పారపెల్లి గ్రామం,కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా,తెలంగాణ రాష్ట్రం.రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్ సీఎం)/ఇంచార్జీ డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి, ఛత్తీస్గఢ్.ఇతను 1983 సంవత్సరంలో సిపిఐ (ఎంఎల్) పిడబ్ల్యూలో దళ సభ్యునిగా చేరి చెన్నూర్ దళం లో పనిచేశాడు.1988 సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు1989 సంవత్సరంలో చౌదరి ఆంకుభాయి(అనితక్క)ను వివాహం చేసుకున్నాడు.ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు2002 సంవత్సరంలో డీసీఎంగా పదోన్నతి పొంది తిరిగి డీకేఎస్ జెడ్ సి లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యాడు.2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇంచార్జ్ గా నియమించింది.2023 సంవత్సరంలో ఇతనికి డీకే ఎస్ జెడ్ సీఎంగా పదోన్నతి లభించింది.లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు.ఆత్రం లచ్చన్న పై తెలంగాణలోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదచేయబడ్డాయి.2చౌదరి ఆంకుభాయి(అనితక్క)-55 సంవత్సరాలు,ఆగరగుడా గ్రామం,బెజ్జూర్ మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.డీసీఎం,డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి,ఛత్తీస్గఢ్.అనితక్క 1988వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో సిపిఐ(ఎంఎల్)పిడబ్ల్యులో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్  దళంలో పనిచేసింది.ఆ సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది.1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయింది.2002 సంవత్సరంలో ఏసీఎంగా పదోన్నతి పొంది తిరిగి డీకే ఎస్ జెడ్ సిలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్త తోపాటుగా బదిలీ అయ్యింది2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది.ఈమె లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ డివిసిలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో డీసీఎంగా పనిచేస్తుంది.చౌదరి ఆంకుభాయి పై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదచేబడ్డాయి.మీ ఊరికి రండి!మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం.రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ తరుపున,అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రావాలిసినదిగా కోరుచున్నాము.తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని,తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరారు.అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే,తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు,ఇతర సహాయ సహకారాలు అందిస్తుందనీ ప్రకటించారు.దాంతో స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుందనీ పేర్కొన్నారు.ఆ లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.ప్రజా సంఘాల ముసుగులో-దందాలు..కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారు.అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందనీ వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయనీ ప్రకటించారు.యువత,ప్రజలు ఇటువంటి వారికి దూరంగా ఉండాలనీ మావోయిస్టులకు నేటి యువత దూరం..ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారు.మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది.చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదన్నారు.కాలం చెల్లిన సిద్ధాంతం మావోయిజం..నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయిందని హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారనీ ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మావోయిజం కనుమరుగైపోయిందనీ సీపీ వివరించారు పోరు వద్దు!! -ఊరు ముద్దు!!ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి!! -జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు.ఆ సమావేశంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్,అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు,జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి,చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,కోటపల్లి ఎస్సై రాజేందర్,నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్,సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి