గాంధారి మైసమ్మ తల్లి-మా..కోరికలన్నీ నెరవేర్చమ్మో...
గాంధారి మైసమ్మ తల్లి-మా..కోరికలన్నీ నెరవేర్చమ్మో...
- మైసమ్మ తల్లి బోనాల జాతరకు తరలిన వేలాది సంఖ్యలో భక్తులు
- బొక్కలగుట్ట జాతీయ రహదారిపై భక్తులతో కిటకిట లాడిన జాతర
- కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ బోనమెత్తుకొని మైసమ్మకు సమర్పించారు
- బొక్కలగుట్ట చెరువు నుంచి బోనాలతో ఆలయం వరకు చేరిన భక్తులు
- డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ..భక్తీశ్రద్ధలతో అమ్మవారికి మ్రొక్కులు
- వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు పంట మంచిగా పండాలి
- ప్రజాపాలనలలో ప్రజలకు మేలు కలిగేలా ఆశీర్వాదించాలని అమ్మవారిని కోరిన మంత్రి వివేక్
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనే గల శ్రీ గాంధారి మైసమ్మ ఆషాడ మాస బోనాల జాతర పండుగ ఆదివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఆ జాతర వేడుకలకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా బొక్కల గుట్ట చెరువు నుంచి ప్రారంభమైన భారీ ఎత్తున ఊరేగింపులో జాతరకు విచ్చేసిన భక్తులతో పాటు మైసమ్మ తల్లి యొక్క బోనాలను మంత్రి తలపై ఎత్తుకొని ఆలయం వరకు కాలినడకన చేరుకున్నారు.దాంతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్యన డిజె సౌండ్స్ పాటలతో బోనాలతో భక్తులు మైసమ్మ తల్లి ఆలయం వరకు చేరుకున్నారు.అనంతరం మైసమ్మ తల్లికి మంత్రి వివేక్ బోనాలు సమర్పించుకొని మ్రొక్కుబడులు చెల్లించుకున్నారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు..ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలు మెండుగా పడాలని కురువాలని రైతన్నలకు పంటలు బాగా పండాలని అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆ మైసమ్మ తల్లిని కోరినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలన కూడా సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మంచిగా కొన సాగుతుందని ప్రజలందరూ కూడా ప్రభుత్వమందించే అనేక పథకాలు సద్వినియోగం చేసుకొవాలని కోరారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాదిరిగా అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చడమే కాకుండా తెల్ల రేషన్ కార్డులు కూడా మంజూరు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకి దక్కిందని వివరించారు.టిఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు.అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజా పరిపాలన విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.ప్రధానంగా మైసమ్మ ఆలయం బొక్కల గుట్ట వద్ద నిర్మాణం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిపోతున్న దృష్ట్యా స్థానిక ప్రజలందరి కోరికలు తీరుస్తున్న మైసమ్మ తల్లికి భక్తులందరూ కూడా భక్తిశ్రద్ధలతో ఈ సంవత్సర వరకు కూడా మ్రొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఆ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వందలాది-వేలాది సంఖ్యలో మైసమ్మ జాతరకు చేరుకొని ఆషాడ మాసంలో బోనాలు మైసమ్మ తల్లికి సమర్పించుకొని చల్లంగా చూడాలని మేకలు కోళ్లు బలిదానాలు పెద్ద ఎత్తున అర్పించి కానుకలు సమర్పించడంతోపాటు మ్రొక్కుబడులు సమర్పించుకున్నారు.అలాగే కొత్త వాహనాలకు పూజలు కూడా చేసుకోవడం కనిపించింది.అయితే మైసమ్మ తల్లి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చాలని అత్యంత భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు కోట్టడంతోపాటు పసుపు కుంకుమలతో పెద్ద ఎత్తున పూజలు చేశారు.అంతేకాకుండా మైసమ్మ తల్లికి పూజలు చేసుకున్నా అనంతరం గాంధారి వనంలో వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనం చేయడంతో పాటు సంతోషంగా రోజంతా గడిపారు.ఆ తరుణంలో నేషనల్ హైవే రోడ్డుపై అనేక వాహనాలతో పాటు వందలాది మంది భక్తులతో ఆలయం నుంచి రెండు వైపులా చాలా దూరం వరకు ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ సమస్య కనిపించింది.అయినా కూడా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి భక్తులకు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం కనిపించింది.ఆ సమయంలో మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ కూడా మైసమ్మ తల్లి జాతరకు చేరుకొని మ్రొక్కుబడులు సమర్పించుకున్నారు.కాగా జిల్లా పోలీస్ అధికారి ఆదేశాలు మేరకు పోలీస్ అధికారులు పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విధులు నిర్వహించడం కనిపించింది.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,పోలీస్ అధికరులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు,మహిళలు,యువతీ యువకులు,చిన్న పిల్లలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment