లావణ్య మృతితో న్యాయం చేయాలని బంధువుల న్యాయపోరాటం?
లావణ్య మృతితో న్యాయం చేయాలని మృతదేహంతో బంధువుల న్యాయపోరాటం?
-- రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న లావణ్య మృతి
-- 50-లక్షల కట్నం 30-తులాల బంగారం కట్నం ఇవ్వాలని విజ్ఞప్తి
-- పంచాయతీలో సురేష్ తల్లిదండ్రులు 20 లక్షలకు అంగీకారం..
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కు చెందిన గాండ్ల సత్యం అతని కుమార్తె ముద్దసాని లావణ్యకు ఇటీవల కాలంలో జరిగిన గోర బైక్ రోడ్డు ప్రమాదంలో సత్యం సంఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఆ రోడ్డు ప్రమాదంలో లావణ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కూడా మృతి చెందారు.ముఖ్యంగా రామకృష్ణపూర్ కు చెందిన ముద్దసాని సురేష్ తో లావణ్యకు గతంలో వివాహం జరిగింది.ఆ భార్యాభర్తల మధ్య జరిగిన తగాధం కాస్తా కోర్టు దాకా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది.అయితే ఊహించని విధంగా పెద్దపల్లి సమీపంలో వద్ద జరిగిన ఆ రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కూతురు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు.దాంతో లావణ్య మృతదేహాన్ని ఆంబులెన్స్ ద్వారా తీసుకువచ్చి ఆ మృతురాలి తల్లి ఆమె బంధువులు ఆమె మృతదేహంతో న్యాయపోరాటంకు దిగారు.అయితే మృతిచెందిన లావణ్యకు పెళ్లి జరిగిన సమయంలో పెళ్ళికొడుకు కాబడిన ముద్దసాని సురేష్ కు 50 లక్షల కట్నం 30 తులాల బంగారం ఇచ్చినట్లు దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోర్టులో కేసు నడుస్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు.అయితే లావణ్య కూడా మృతి చెందడంతో ఆ కట్నం కింద ఇచ్చిన డబ్బులు అన్ని కూడా ఇవ్వాలని మృతదేహంతో శనివారం ఆమె బంధువులు అందరు కూడా కలిసి శుక్రవారం నుంచి శనివారం వరకు ఎక్కువ గంటలు తరబడి న్యాయపోరాటంకు దిగారు.దాంతో విషయం తెలిసిన పోలీసులు రామకృష్ణాపూర్ చేరుకున్నారు.ఆ విషయంలో మందమర్రి సీఐ కే.శశిధర్ రెడ్డి నేతృత్వంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్,ఆర్కేపీ ఎస్సై రాజశేఖర్ ఇంకా పోలీసులు అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్యోగరీత్యా పకడ్బందీగా
విధులు నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే చివరికి స్థానిక ఠాగూర్ స్టేడియంలో పెద్దల సమక్షంలో జరిగిన అక్కడి పంచాయితీలో కట్నం కింద ఇచ్చిన విషయంలో 20 లక్షలు అలాగే మిగతా ఇన్సూరెన్స్ కు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడానికి సురేష్ తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.దాంతో ఎలాంటి గొడవలు లేకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
Comments
Post a Comment