కుర్మపల్లి అండర్ బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు
కుర్మపల్లి అండర్ బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు
-- సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా
-- సిఐ శశిధర్ రెడ్డి,ఎస్సై రాజశేఖర్
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుర్మపల్లి అండర్ బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం మందమర్రి సీఐ కే.శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు.కాగా సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ ఆ వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు.ఆ నేపథ్యంలోనే సరైన పత్రములు లేని సంబంధిత వాహనంలకు జరిమానా విధించారు.ఆ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..వానాదారులు తప్పకుండా వాహనా పత్రములు కలిగి ఉండాలని గుర్తు చేశారు.అలాగే సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని,టు వీలర్ దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని,మద్యం సేవించి అసలు వాహనములు నడపరాదని ప్రకటించారు.ఆ రాంగ్ రూట్లో వెళ్లరాదని కోరారు.ఆ కార్యక్రమంలో సిఐ కే.శశిధర్ రెడ్డి,ఎస్సై జి.రాజశేఖర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment