ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు










ఆర్కేపీ ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ జక్కుల ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ గూడెపు పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు

--  ఆసుపత్రిలో డాక్టర్ ప్రభాకర్,స్వీపర్ పోలమ్మకు ఘనంగా సత్కారం

రామకృష్ణాపూర్ న్యూస్,జులై-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో గా పనిచేసిన డాక్టర్ జక్కుల ప్రభాకర్ (61) అలాగే ఆసుపత్రిలో ఎస్.ఎన్.ఎస్ గా పనిచేసిన గూడెపు పోలమ్మ (61)అనే స్వీపర్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో డాక్టర్ ప్రభాకర్ అలాగే గూడెపు పోలమ్మను సింగరేణి యాజమాన్యం ఘనంగా సత్కరించింది.ఆ నేపథ్యంలోనే ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ముందుగా డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా ఆయన సర్వీసులో 30 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసినట్లు దాంతో ఉద్యోగ విరమణ పొందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.అలాగే గూడెపు పోలమ్మ కూడా 34 సంవత్సరాల 11 నెలలు ఉద్యోగంలో సర్వీస్ పూర్తి చేసి రిటైర్డ్ అయినట్లు పేర్కొన్నారు.ఆ సందర్భంగా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ ప్రభాకర్ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడు చల్లంగా చూడాలని కోరారు.డాక్టర్ ప్రభాకర్ డ్యూటీ టైం లో ఎప్పుడు కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఓపికతో పేషెంట్లను పలకరిస్తూ ఆయన యొక్క ఉద్యోగం సర్వీసును పూర్తి చేసినట్లు వివరించారు.అలాగే గూడెపు పోలమ్మ కూడా ఉద్యోగంలో అందరితో కలిసి మెలిసి ఉండడమే కాకుండా మంచిగా ఉద్యోగ ధర్మం పూర్తి చేసినట్లు దేవుడు వాళ్ల కుటుంబాలను ఆశీర్వదించాలని కోరారు.ఆ తరుణంలో ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ..



ఆయన ఉద్యోగ సర్వీసులో సహకరించిన అందరికీ  పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి కంపెనీ సీ అండ్ ఎండి బలరాం,సీఎంఓ కిరణ్ రాజ్ అలాగే డైరెక్టర్లు,జనరల్ మేనేజర్లకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.అనంతరం ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లు,అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు డాక్టర్ జక్కుల ప్రభాకర్ దంపతులను అలాగే గూడెపు పూలమ్మ ఎస్ఎన్ఎస్ దంపతులను కూడా శాలువాలు కప్పి జ్ఞాపకాలు అందజేసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఘనంగా సన్మానించారు.ఆ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో డాక్టర్ ప్రసన్నకుమార్,డాక్టర్ శ్రీకాంత్,సంక్షేమ అధికారి ఎండి మాదార్ సాహెబ్,ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి,మ్యాట్రిన్ విజయలక్ష్మి,ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు,ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు,వార్డు బాయ్ లు,నర్సులు,ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి