ఆర్కేపిలో చికిత్స పొందుతూ శ్రీనాథ్ వడ్రంగి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
---------------------------------------- మృతుని ఫైల్ ఫోటో ఇది ------------
-- ఆ మృతుని వివరాలు తెలిపిన సిఐ కే.శశిధర్ రెడ్డి
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాకతీయ కాలనీలో నివసించే గొల్లపల్లి శ్రీనాథ్(25)అనే వడ్రంగి పని చేసుకునే యువకుడు శుక్రవారం వైద్య చికిత్సలు పొందుతూ ఊహించని విధంగా మృతి చెందాడు.ఆ క్రమంలో చూస్తే..పూర్తి వివరాల్లోకి వెళితే..ఆర్కేపీలోని సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో వడ్రంగిగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తూన్నా శ్రీనాథ్ కు కడుపునొప్పి రావడంతో భగత్ సింగ్ నగర్ లోని ఒక డాక్టర్ వద్దకు వెళ్లి ఇంజక్షన్ వేయించుకున్నట్లు తెలుస్తుంది.అటు తర్వాత ఇంటికి వచ్చి ఒక టాబ్లెట్ వేసుకున్నట్లు కూడా అతని తండ్రి తెలిపారు.దాంతో అతని నోటిలో నుంచి నురుగు రావడంతో వెంటనే మంచిర్యాలలోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిసింది.ఆ మృతునికి ఇంకా వివాహం కాలేదు.అటుపిమ్మట మృతుని తండ్రి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు.ఆ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శశిధర్ రెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు.ఆ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.ఆ కేసు విషయంలో దర్యాప్తు సాగుతుందని పోస్టుమార్టం అనంతరం తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Comments
Post a Comment