అనుమతులు లేని ఆర్ఎంపి-పిఎంపి క్లినిక్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
అనుమతులు లేని ఆర్.ఎం.పి-పి.ఎం క్లినిక్ లపై చర్యలు తీసుకోవాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్ న్యూస్,జులై-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : అనుమతి లేకుండా ఆర్.ఎం.పి పిఎంపి క్లినిక్ లు అడ్డగోలుగా నడుపుతున్నా డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ-సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు.ఆ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సీపీఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణలు మాట్లాడారు.రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్ఎంపీ డాక్టర్ లు హద్దు అదుపు లేకుండా స్వంతగా పరీక్షలు నిర్వహించడమే గాక ఇష్టారీతిన వైద్యం చేస్తున్నట్లు తెలిపారు.దాంతో ఆభం శుభం తెలియని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.దానికి తోడూ జిల్లా వైద్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన సంబంధిత డాక్టర్లు ఇష్టారీతిన వైద్యం చేస్తూ వారికి నచ్చినా పద్ధతిలో ఆర్ఎంపీ డాక్టర్లు లేకుంటే వారి వద్ద వున్న అటెండర్స్ తో కూడా వైద్యం చేస్తున్నారనీ వివరించారు. ఆర్కేపీలో శుక్రవారం గొల్లపల్లి శ్రీనాథ చారి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ కు చెందిన ఆర్ ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొద్దీ సేపటికి మరణించటం జరిగిందని ఆరోపించారు.ఆ మృతుని కుటుంబ సభ్యులు రామకృష్ణ పూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసినా కూడా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసిందన్నారు.పోలీసు కేసు నమోదు ఆర్.ఎం.పి,పి.ఎం.పి డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆ విషయమై తెలంగాణ మెడికల్ అధికారులకు పిర్యాదుచేస్తామని ఆర్ ఎంపీ డాక్టర్ తో పాటు మెడికల్ షాప్ పైన కూడా పిర్యాదుచేయబోతున్నట్లు వెల్లడించారు.ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఫార్మసీ సర్టికేట్ ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు షాప్ లు నడిపిస్తున్నట్లు గుర్తు చేశారు.ఒక పక్క బాధితుడు మరణించి దుఃఖంలో ఉంటే బాధితుల పక్షాన నిలబడవలసిన కొంత మంది నాయకులు ఆర్.ఎం.పి పక్షాన నిలబడి అతనికి మద్దతు ఇవ్వడమే గాక 2లక్షలకు సెటిల్ మెంట్ చేసి ఆ కేసు నమోదు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.అతిదారుణంగా ఆ కుటుంబ దుఃఖంలో ఉంటే ప్రాణానికి 2లక్షల విలువ కట్టడం అనేది చాలా దురదృష్ట కరమనీ ఇప్పటికైన పోలీసులు వైద్య అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలబడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆ కార్యక్రమంలో సీపీఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్,జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య,సిపిఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి,కాదండి సాంబయ్య,మిట్టపల్లి ఫౌల్,మామిడి గోపి,సీపీఐ నాయకులు పోలవేని చందర్,ఎగుడ మొండి,తదితరులు పాల్గోన్నారు.
Comments
Post a Comment