ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినంతో కేక్ కట్ చేసి సంబురాలు





ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినంతో కేక్ కట్ చేసి సంబురాలు











---  సూపర్ బజార్,శివాజీ నగర్ లో పతాకం ఆవిష్కరించిన ఆర్కేపి మాదిగ దండోరా

రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతన పల్లి మున్సిపాలిటీ పట్టణంలో సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ లో ముందుగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల ఎమ్మార్పీఎస్ జెండా వద్దకు చేరుకొని అక్కడ జెండాను కూడా కొబ్బరికాయలు కొట్టిన పిదప పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.


కాగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఆర్ కే పి టౌన్ అధ్యక్షులు రాచర్ల సరేష్ తో ఆధ్వర్యంలో భారీ ఎత్తున నినాదాల మధ్యన ఈరోజు మాదిగలందరూ కలిసి ఐకమత్యంగా వేడుకలు నిర్వహించుకున్నారు.ఆ సందర్భంగా రాచర్ల సురేష్,ఆర్.పోశంమాట్లాడారు.ఆ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ నాయకులు కన్నూరి రాజేందర్,ఆరింద సతీష్,మాజీ అధ్యక్షులు రేణిగుంట్ల పోశం,కలువల శ్రీనివాస్,కాదాసి సంపత్,ఆరుముళ్ళ పోశం,సలిగొమ్ముల రమేష్,నవీన్,దాసరపు ఆగయ్య,రామిళ్ళ మల్లేష్,పూర్ణచందర్,కలువల శంకర్,సుభాష్,గట్టయ్య స్వామి,రాచర్ల అనిల్,ఎలుక శంకర్, ఇల్లందుల సారయ్య,దుర్గ స్వామి,చెరుకు స్వామి,నందిపేట సదానందం,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి