బంగారం ఎత్తుకెళ్లిన దొంగను 24-గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

బంగారం ఎత్తుకెళ్లిన దొంగను 24-గంటల్లోనే పట్టుకున్న పోలీసులు 

-  సిసి ఫుటేజ్ ద్వారానే ఆ సురేష్ దొంగను పట్టుకున్నారు

-  దొంగను పట్టుకున్న పోలీసులకు క్యాష్ రివార్డు-అభినందనలు

-  ఇంటి ముందర అందరూ తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి 

-  బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్

-  ఆర్కేపి పోలీస్ స్టేషన్లో ప్రింట్ మీడియా సమావేశం

రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరగడి ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లోనే సురేష్ అనే దొంగను పట్టుకొని అరెస్టు చేసినట్లు బంగారం సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రింట్,మీడియా సమావేశంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన తెలిపారు.రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన ఆ దొంగతనం కేసును కేవలం 24 గంటల్లోనే పట్టణ పోలీసులు చేదించినట్లు తెలిపారు.ఆ నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని,దొంగిలించబడిన పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి తెలిపారు.కాగా తేది 8-8-2025న రామకృష్ణాపూర్‌లోని పద్మావతి కాలనీకి చెందిన మేకల రాజయ్య యొక్కనూతన గృహంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు.అదే రోజు రాత్రి 11:00 గంటల సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిద్రకు ఉపక్రమించారు.ఆ మరుసటి రోజు ఉదయం(09-08-2025)03:00 గంటలకు లేచి చూసేసరికి వాళ్ల ఇంట్లోని బ్యాగులో దాచి ఉంచిన సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు.ఆ నేపథ్యంలోనే వెంటనే బాధితుడు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.ఆ కేసు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన రామగుండం పోలీస్ కమీషనర్ అంబార్ కిషోర్ ఝా(డీఐజీ)ఆదేశాలు మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఉత్తర్వుల ప్రకారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో దర్యాప్తును ముమ్మరం చేశారు.ఆ తరుణంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్,మందమర్రి ఎస్ఐ రాజశేఖర్,సీసీఎస్ ఎస్ఐలు మధుసూదన్,లలిత పోలీసు సిబ్బందితో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఆ దర్యాప్తులో భాగంగా దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.తేది 10-08-2025న అమ్మగార్డెన్ ఏరియాలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా అదే వ్యక్తి అక్కడ కనిపించడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారనీ వివరించారు. దాంతో పోలీసులను చూసిన ఆ నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా బృందాలు అతడిని చాకచక్యంగా పట్టుకున్నాయనీ అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీలు చేయగా దొంగిలించబడిన బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు వెల్లడించారు.ఆ


విచారణలో నిందితుడు తేది 09-08-2025న పద్మావతి కాలనీలో దొంగతనం చేసినట్లు అంగీకరించాడనీ దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.ఆ నేరస్తుడి వివరాలు పేరు జాడి సురేష్ నివాసం:రాజీవ్ నగర్ మంచిర్యాలలో ఉంటాడు.ఆ నిందితుడిపై గతంలో (5) కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.పోలీసులు నిందితుడి వద్ద నుంచి పూర్తి సొత్తు అయిన 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని,అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

--  ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి 

-- బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ..








దొంగతనం కేసును ఇంత త్వరగా ఛేదించడంలో సీసీ కెమెరాల ఫుటేజ్ అత్యంత కీలక పాత్ర పోషించిందనీ తెలిపారు.ఆ నేరాల నియంత్రణలో నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో సహాయపడతాయనీ గుర్తు చేశారు.ప్రజలు తమ నివాస గృహాలు,వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలనీ అది భద్రతకే కాక,సమాజ భద్రతకు కూడా దోహదపడుతుందనీ వెల్లడించారు.ఆ సీసీ కెమెరాలు దొంగలకు నిరోధకంగా పనిచేస్తాయనీ నేరం జరిగినప్పుడు అమూల్యమైన సాక్ష్యంగా ఉపయోగపడతాయనీ ప్రజలందరూ పోలీసులకు సహకరించి,తమ పరిసరాలను సురక్షితంగా మార్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.ఆ కేసును 24 గంటల్లో ఛేదించి,అత్యంత ప్రతిభ కనబరిచిన మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్,మందమర్రి ఎస్ఐ రాజశేఖర్,సీసీఎస్ ఎస్ఐలు మధుసూదన్,లలిత,హెడ్ కానిస్టేబుళ్ళు హేమసుందర్,సత్తయ్య,సిబ్బంది జంగు,రాము,రాజేశ్వర్ రావు,వెంకటేష్,రాకేష్,మహేష్,సీసీఎస్ కానిస్టేబుళ్ళు సతీష్,శ్రీనివాస్‌లను ఏసీపీ రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం క్యాష్ రివార్డులను వాళ్లకు అందజేశారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి