కేకే-5 గనిలో ప్రమాదం శ్రావణ్ కుమార్ కార్మికుడు మృతి

కేకే-5 గనిలో ప్రమాదం శ్రావణ్ కుమార్ కార్మికుడు మృతి

ఆర్కేపి నివాసి ఎస్ డి ఎల్ ఆపరేటర్ గా పనిచేశాడు




రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల కేకే-5 గనిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆగని భూగర్భంలో జరిగిన ప్రమాదంలో రాపల్లి శ్రావణ్ కుమార్(32)అనే అసిస్టెంట్ యాక్టింగ్ ఎస్ డి ఎల్ ఆపరేటర్ కార్మికుడు మృతి చెందాడు.ఆ క్రమంలో చూస్తే..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కు చెందిన శ్రావణ్ కుమార్ ఆరోజు గని భూగర్భంలోని 90 డిప్ 32 ఆఫ్ లెవెల్ వద్ద పని వర్కింగ్ స్థలంలో అతను ఉద్యోగరీత్యా పని చేస్తుండగా ఎస్ డి ఎల్ మిషన్ ఆ సమయంలో రిపేర్ కావడంతో ఆ యంత్రం పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడి పని స్థలంలో సైడ్ వాల్ కూలి అతనిపై పడింది.దాంతో అక్కడి బొగ్గు పొరలు ఎస్ డి ఎల్ యంత్రం మధ్యలో ఊహించని విధంగా ఆ శ్రావణ్ కుమార్ చిక్కుకున్నాడు. దాంతో తోటి కార్మికులు వెంటనే మందమర్రి కేకే-1డిస్పెన్సరీ కి తరలించారు.ఆ తరువాత అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియాస్ ఆసుపత్రికి తరలించడంతో ఇంకా మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచనలు మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆ కార్మికుడు మృతి చెందాడు.ఆ విషయం తెలిసిన వెంటనే మందమర్రి జిఎం జి.దేవేందర్ తోపాటు సంబంధిత అధికారులు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి చేరుకొని ఏరియా ఆసుపత్రి డివైస్ డాక్టర్ ప్రసన్న కుమార్ తో మాట్లాడారు.దాంతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి