79వ స్వాతంత్ర దినోత్సవంతో పతాకం ఆవిష్కరించిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్వామి
79వ స్వాతంత్ర దినోత్సవంతో పతాకం ఆవిష్కరించిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్వామి
- కొబ్బరికాయలు కొట్టి స్వాతంత్ర సమరయోధులకు ప్రెస్ క్లబ్ కమిటీ సెల్యూట్...
- స్వాతంత్ర సమరయోధుల విరోచితమైన త్యాగపోరాటమే మనకు రక్షణ
- ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ ప్రసంగం...
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం-15 ఆగస్టు 2025 పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆరంద స్వామి మువ్వన్నెల మూడు రంగుల జాతీయ పతాకంను ఆవిష్కరించారు.ఆ క్రమంలో చూస్తే.. రామకృష్ణాపూర్లోని రాజీవ్ చౌక్ లో గల మూతబడిన సివి రామన్ స్కూలు ముందుగల స్థలంలో ఏర్పాటుచేసిన ప్రోగ్రాంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తితో నిర్వహించారు.ఆ సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు.అనంతరం కొబ్బరికాయలు కొట్టారు.తదానంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
(సిటీకేబుల్ రిపోర్టర్)స్వామి జాతీయ పతాకంను ఆవిష్కరించారు.దాంతో ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా సెల్యూట్ చెప్పి జనగణమన అధినాయక జయహే..అనే జాతీయ గీతం పాడారు.ఆ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు,ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్(జర్నలిస్టు తెలుగు దినపత్రిక)ప్రసంగించారు.దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు,స్వాతంత్ర సమరయోధులు చేసిన గొప్ప పోరాటాలు -త్యాగాలే మనకు నేడు రక్షణగా ఉన్నాయని గుర్తు చేశారు.ఆ నేపథ్యంలోనే అందరికీ క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ కార్యక్రమంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏ.స్వామి,ప్రధాన కార్యదర్శి సారంగరావు,ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు పి.గట్టయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్,వెలుగు రిపోర్టర్ బి.శ్రీనివాస్,నాంపల్లి గట్టయ్య,వేణుగోపాల్ రెడ్డి,కొండ శ్రీనివాస్,గోపికృష్ణ,పిడి.రాజేందర్,సంతోష్,గంగన్న,దేవేందర్,ప్రవీణ్,శ్రీనాథ్,డాక్టర్ స్వామి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment