ఆర్కేపి ప్రగతి కాలనీలో పెద్ద కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్స్

ఆర్కేపి ప్రగతి కాలనీలో పెద్ద కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్స్

-- చిన్నపిల్లలను మింగే కొండచిలువ భయంకరంగా ఉంది 

--  30 కిలోల బరువు,15 ఫీట్లు పొడవుతో కనిపించింది









రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ప్రగతి కాలనీలోనీ హెచ్ డి -60 అనే నెంబర్ గల క్వాటర్ లో శుక్రవారం సాయంత్రం సంచరించిన భారీ ఎత్తున కొండచిలువను స్నేక్ క్యాచర్స్ కాబడిన ఇద్దరూ సింగరేణి ఉద్యోగులు ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఆ క్రమంలో చూస్తే.. అక్కడి ఇంట్లో కనిపించిన ఆ కొండచిలువ విషయమై స్నేక్ క్యాచర్స్కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడి ప్రదేశానికి చేరుకొని దాదాపు 30 కిలోల బరువుతో పాటు 15 ఫీట్ల పొడవు ఉన్న పెద్దగా ఉన్న ఆ కొండచిలువను ఆ ఇద్దరు చాకచక్యంగా  పట్టుకున్నారు.ఆ సందర్భంగా రామకృష్ణాపూర్ లోని ఆర్కే నాలుగు గడ్డ ప్రాంతంలో నివసించే స్నేక్ క్యాచర్స్ కాబడిన చాపిడి రాజేందర్ శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే7 గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు.అలాగే కామెర రాజేందర్ అనే మరో సింగరేణి కార్మికుడు కాసిపేట2 గనిలో ట్రామర్ గా పనిచేస్తున్నాడు.అయితే గత 10 సంవత్సరములుగా ఆ పాములను పట్టుకొని వాటిని దూర ప్రాంతాలలో మనుషులు లేని అడవి ప్రాంతంలో వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది.ఆ సందర్భంగా స్నేక్ క్యాచర్స్ కాబడిన చాపిడి రాజేందర్ ఇంకా కామెర రాజేందర్ అనే సింగరేణి ఉద్యోగులు మాట్లాడుతూ..అక్కడ పట్టుకున్న కొండచిలువ మొగ పాముగా గుర్తించారు.అలాగే అక్కడి ప్రాంతంలో అడ కొండచిలువ కూడా తప్పకుండా ఉంటుందని మోగపాము ఉన్న కాడ ఆడపాము ఉంటుందని గుర్తు చేశారు.ముఖ్యంగా ఈ కొండచిలువ చిన్న పిల్లలను గట్టిగా బలంగా చుట్టుకొని ఆ పాము యొక్క బలం చూపెట్టడమే కాకుండా చిన్న పిల్లలను కూడా మింగుతుందని తెలిపారు.ఆ కొండ చిలువ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఆ పామును సంచిలో పట్టుకొని తీసుకువెళ్లి మనుషులు సంచరించని ప్రదేశంలో అడవిలో వదిలేస్తామని తెలిపారు.ఇప్పటివరకు విషపూరితమైన 5వేలకు పైగానే పాములను కూడా పట్టుకొని గత పది ఏండ్లుగా స్నేక్ క్యాచర్స్ అసోసియేషన్ ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు.ఆ నేపథ్యంలోనే మీ ఇంటి దగ్గరలో ఎలాంటి పాములు కనిపించిన వెంటనే 9 00 0 5 8 0 3 8 3 లేదా 9 5 5 0 4 5 2 7 9 1 సెల్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ప్రకటించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి