నేడు మహిళా సమానత్వ దినోత్సవం-మహిళా సమానత్వ సవాళ్లు
మహిళా సమానత్వ సవాళ్లు
-- నేడు మహిళా సమానత్వ దినోత్సవం
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..
మహిళా నేటికీ పురుషాధిక్య సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే భావించబడుతున్నది.ఆ క్రమంలో చూస్తే..అసమానతల అంతరాల్లో వంటింటి కుందేలవుతున్నది.ఆర్థిక స్వేచ్ఛ ఇంకా ఆమడదూరంలోనే ఉన్నది.ఆమె గళం గడప దాటడం లేదు.పడతి మాటకు విలువుండటం లేదు.ఒంటరి మహిళను నేటికీ అసహ్యంగా చూస్తున్న దుస్థితి.ఆమె తెర వెనుక శ్రమజీవి,ఆయన తెరపైన కాలర్ ఎగిరేసే పురుష పుంగవుడు.భర్త చనిపోతే సతీ సహగమనం పాటించిన సమాజం మనది.స్త్రీ శ్రమకు విలువ పాతాళంలో,పురుషుని శ్రమ విలువ ఆకాశమంత.ఆమె ఎప్పటికైనా అత్తింటికి వెళ్లే ఆడదేనన్న చిన్నచూపు ఇంకా మనం జీవిస్తున్న ఈ సమాజంలో వేళ్లూనుకుని ఉన్నది.దీన్ని అధిగమించడానికి అనేకరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నా వారికి అడుగడుగునా వివక్షే ఎదురవుతున్నది.దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అక్కడ కూడా ఆధిపత్యమే రాజ్యమేలుతున్నది.అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమిస్తూ మహిళ తానేంటో నిరూపించుకుంటున్నది.కానీ పౌరసమాజం నుంచి కావాల్సినంత సహకారం ఉండటం లేదు.మహిళా సమానత్వంపై అవగాహన కల్పించడం నేటి పరిస్థితుల్లో చాలావరకు కనిపించడం లేదని చెప్పడంలో అసలు సందేహం లేదు.
Comments
Post a Comment