గని ప్రమాదంలో మృతి చెందిన శ్రావణ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్
గని ప్రమాదంలో మృతి చెందిన శ్రావణ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్
-- మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: సింగరేణిలోని మందమర్రి ఏరియా పరిధిలో గల కేకే5 గనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రాచపల్లి శ్రావణ్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.ఆ గని ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సంబంధిత గోర విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి స్పందించారు.శనివారం ఏరియా హాస్పిటల్ కు చేరుకున్న మంత్రి ముందుగా మృతదేహానికి నివాళులు అర్పించారు.ఆ బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి కార్మికుడు మన సొంత కుటుంబ సభ్యుడే అన్నారు.వారి త్యాగం అసాధారణం.వారి రక్తం బూదిదిబ్బల్లోనే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా కలిసి ఉందని వ్యాఖ్యానించారు.బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థిక,న్యాయ,ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఆ కుటుంబ సభ్యుల కోసం తక్షణ పరిహారం,ఒకరికీ ఉద్యోగావకాశం,పనివేళ భద్రతా ప్రమాణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.సింగరేణి కార్మికుల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కట్టుబాటు కలిగి ఉందని అలాంటి ఘటనలు పున:రావృతం కాకుండా సాంకేతిక,భద్రతా పరంగా తగిన సంస్కరణలు తీసుకురావాలని సింగరేణి కంపెనీ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.ఆ కార్యక్రమంలో సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఏఐటీయుసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,ఐఎన్టియుసి,సిఐటియు యూనియన్ నాయకులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,అధికార ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment