వినాయక విగ్రహాలు-మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి

వినాయక విగ్రహాలు-మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి

-- ఆర్కేపి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి 

--  ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన

రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : వినాయక విగ్రహాలు,వినాయక మండపాల పూర్తి వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసి పోలీస్ స్టేషన్ లో సమాచారం తెలియజేయాలని గురువారం రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..పట్టణ ప్రజలందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఆ నేపథ్యంలోనే *https://share.google/U5GINHpB3dXvEUnSy*


ఈ Link ద్వారా సులభంగా మీ విగ్రహాలు ఇంకా మండపాల పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.గణపతి నవరాత్రులు పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో  వినాయక విగ్రహాలు పెట్టేవారు తప్పనిసరిగా మండపాల పూర్తి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలనీ తద్వారా ఆ మండపాల వద్ద భద్రత,బందోబస్త్ నిర్వహించడం సులభతరం అవుతుందనీ ఎస్.ఐ తెలిపారు.కాగా ఆన్లైన్ లో పూర్తి వివరాలు నమోదు చేయడం వలన మాత్రమే వినాయక మండపాలకు అనుమతి లభిస్తుందనీ *https://share.google/U5GINHpB3dXvEUnSy* పై లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తుదారుల వివరాలు,విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,మండపం ఎత్తు,విగ్రహం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు,మొబైల్ నెంబర్లు,విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే సమయం,నిమజ్జనానికి ఉపయోగించే వాహనం,దాని నెంబర్ ఇంకా డ్రైవర్ పూర్తి వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా నమోదు చెయ్యవలసి ఉంటుందనీ ఎస్.ఐ సూచించారు.ఆ గణేష్ మండపాల నిర్వాహకులు మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చెయ్యాలనీ,విగ్రహాలకు నిమజ్జనంకు వెళ్లే వారి తరలింపు కోసం పూర్తి కండీషన్ లో ఉన్న వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.అదేవిధంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రకారం గణపతి మండపాల వద్ద పూజ కార్యక్రమాల కోసం రాత్రి 10:00 గంటల వరకు తక్కువ శబ్దం వచ్చు స్పీకర్లను మాత్రమే వాడాలన్నారు.ఆ డీజేల పై నిషేధం ఉన్నందున శోభయాత్ర సమయంలో ఎట్టిపరిస్థితిలో కూడ డీజేలను పెట్టవద్దని,మండపాలలో 24 గంటలు తప్పనిసరిగా ఇద్దరు వాలంటీర్లను అందుబాటులో ఉంచేలా నిర్వాహకులు చూడాలన్నారు.ఆ మండపాల వద్ద అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా కనీసం రెండు భకీట్ల నీళ్లు,రెండు ఇసుక బస్తాలు ఆ మంటలను అర్పేoదుకు యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ఆ మండపాల వద్ద పేకాట ఆడటం,మద్యం సేవించడం,అన్యమతస్తులను కించపరిచేల ప్రసంగాలు చేయడం,పాటలు పాడటం చెయ్యరాదనీ తెలిపారు.ఆ మండపాల వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోని ప్రతిరోజు తనిఖీలు చేయడానికి వచ్చిన పోలీసులకు సహకరించాలని,మండపాల వద్ద అనుమానస్పదంగా ఏవైనా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు కనపడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా 100 నెంబర్ కు డయల్ చేసి చెప్పాలని ఎస్.ఐ.తెలిపారు.పై విదంగా పట్టణ ప్రజలు సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తూ..పోలీస్ డిపార్ట్మెంట్ వారికీ సహకరిస్తూ గణపతి నవరాత్రులను శాంతియుత వాతావరణంలో,సుఖసంతోషాలతో,ఎలాంటి గొడవలకు,ప్రమాదాలకు తావివ్వకుండా విజయవంతంగా జరుపుకోవాలని ఎస్.ఐ కోరారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి