శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి.

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి.




మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు.

డీజే లకు అనుమతులు లేవు.

గణపతి మండప నిర్వాహక సభ్యులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం.

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి.

పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా.


గోదావరిఖని ప్రతినిధి ఆగస్టు 23 జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్: రామగుండం పోలీస్ కమీషనరేట్ లో గణపతి నవరాత్రిఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం లో మతసామరస్యం సోదర భావంతో పండుగలను  నిర్వహించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్  పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్-నబీ ల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నిర్వహించారు. 

సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786 లో మంచిర్యాల జోన్ పరిధిలో- 2316,పెద్దపెల్లి జోన్ పరిధిలో  2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు.వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర  సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు.గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది.

24×7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగాఉండాలి. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం, బ్లూ క్లోట్స్,పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు. 

మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదు.అలాగే జూదాన్ని నిర్వహించరాదు. బలవంతపు చందాలు తీసుకోరాదు.గణేశుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలి.ప్రతి మండపం వారు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలునిర్వహించకూడదు.

తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలి,అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదు. విద్యుత్ కనెక్షన్లు,లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వైర్లను,పరికరాలను వినియోగించాలి. ప్రమాదము జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్,అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చూసుకోవాలన్నారు.

విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టూ ప్రక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఉండేలాగా ముందు గానే చూసుకోవాలి. కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజామా ,అబద్దమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుకోవాలని అన్నారు.ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100,కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం  నిఘా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి గారు అధికారులను ఆదేశించారు.గణేష్ నిమజ్జనంతో పాటు,మిలన్ -ఉన్ -నబి పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీస్ వారికీ శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్,  స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్,ఏ ఆర్ ఏసి పి ప్రతాప్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు,పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్,ఇతర వింగ్స్ ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు,అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి