పవన్ కుమార్ యువకునికి పున:ర్జన్మనిచ్చిన హైదరాబాదు యశోద హాస్పిటల్ వైద్యం
పవన్ కుమార్ యువకునికి పున:ర్జన్మనిచ్చిన హైదరాబాదు యశోద హాస్పిటల్ మెరుగైన వైద్యం
రోడ్డు ప్రమాదంతో ఫ్రాక్చర్ తర్వాత నరాలకు గాయం
సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అందించిన మెరుగు లేదు
కుడికాలుకు నరం చిక్కుకున్న ఆ నాడిని విడుదల చేశారు
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పి.ప్రకాష్ వివరాలు వెల్లడి
మంచిర్యాల నార్త్ ఇన్ హోటల్లో ప్రింట్ అండ్ మీడియా సమావేశం
మంచిర్యాల న్యూస్,ఆగస్టు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ కు చెందిన పవన్ కుమార్ (24) అనే డిగ్రీ చదువుకునే యువకుడు రోడ్డు ప్రమాదంలో అతని కుడికాలుకు బలమైన గాయాలు కావడంతో అతని నరాలు మచ్చ కణజాలంలో సయాటిక్ నరం చిక్కుకుంది.ఆ క్రమంలో చూస్తే..వివిధ ఆసుపత్రిలో తిరిగిన కూడా డబ్బులు లక్షలు ఖర్చు అయిన కూడా అతనికి సరైన వైద్యం అందకపోవడంతో హైదరాబాదులోని హైటెక్ సిటీలో గల యశోద హాస్పిటల్స్ లో చేరారు.ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడంతో అతనికి పునర్జన్మ లభించింది.ఆ నేపథ్యంలోనే యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్.పి.ప్రకాష్,అసిస్టెంట్ మేనేజర్ పాలకుర్తి నవీన్ కుమార్ తో కలిసి మంగళవారం మంచిర్యాలలోని నార్త్ ఇన్ హోటల్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు.ఆ సందర్భంగా డాక్టర్ పి.ప్రకాష్ మాట్లాడుతూ..యశోద హాస్పిటల్ లో పవన్ కుమార్ కు జరిగిన సిజేరియన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించారు.అయితే పది నెలల క్రితం జరిగిన ఆనాటి రోడ్డు ప్రమాదంలో ఫ్రాక్చర్ సర్జరీ తర్వాత సయాటిక్ నరాల గాయం ఫుట్ డ్రాప్ తో బాధపడుతున్న పవన్ కుమార్ కు విజయవంతంగా నాణ్యమైన వైద్య చికిత్సలు అందించి రికార్డు సాధించినట్లు పేర్కొన్నారు.ఆ పవన్ కుమార్ బాధితుడు రోడ్డు ప్రమాదం తర్వాత తొమ్మిది నెలలుగా చాలా విధాలుగా బాధపడుతూ నొప్పులతో అతను కూర్చున్న లేకపోయేవాడని చాలా రకాలుగా చెప్పలేని విధంగా అనేక కోణాలలో చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు.అంతేకాకుండా నడవలేని పరిస్థితులు ఉండేవని తెలిపారు.కాగా సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు ఫిజియోథెరపీ అందించిన కూడా అతను మెరుగుపడలేదన్నారు.దాంతో 22 మార్చి 2025న సంక్లిష్టమైన సయాటిక్ నరాల న్యూరోలిసిస్ ఇంకా టెన్డో ఆచిలేస్ లెంగ్తేనింగ్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు.దాంతో శాస్త్ర చికిత్స సమయంలో ఇంప్లాంట్ ల చుట్టూ ఉన్న మచ్చ కణజాలంలో సయాటిక్ నరం చిక్కుకున్నట్లు వైద్యులు కనుగొన్నట్లు ఆయన తెలిపారు.ఆ తరుణంలో నాడీని జాగ్రత్తగా విడుదల చేసినట్లు పేర్కొన్నారు.ఆ శాస్త్ర చికిత్స తర్వాత రోగికి గణనీయమైన స్పర్శ ఇంకా పాదాల పనితీరు మెరుగుపడినట్లు వివరించారు.దాంతో అతని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించినట్లు కూడా తెలిపారు.ముఖ్యంగా ఫుట్ డ్రాప్ తో సయాటిక్ నరాల గాయాలు చాలా ఇబ్బందులు కలిగిస్తాయని తరచుగా రోగాలను దీర్ఘ కాలికంగా కదలేని పరిస్థితికి తీసుకువస్తాయని పేర్కొన్నారు.ఆపరేషన్ కాబడిన పవన్ కుమార్ రెండు నెలల్లోనే తక్షణమే కోల్పోవడం పట్ల సంతోషంగా ఉందని ఆ విజయం యశోద హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న అధునాతన రీ కన్స్ట్రాక్టివ్ సామర్ధ్యాలను ప్రదర్శిస్తుందని స్పష్టం చేశారు.హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ రీకాన్స్ట్రక్టివ్ ఇంకా మైక్రోసర్జరీలలో ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని అందిస్తూ అధునాతన సాంకేతిక ఇంకా రోగి సంరక్షణకు బహుళ విభాగ బృందం మద్దతిస్తుందని ప్రకటించారు.అనంతరం ఆపరేషన్ కాబడిన పవన్ కుమార్ మాట్లాడుతూ..యశోద హాస్పిటల్ లో జరిగిన ఆపరేషన్తో తనకు ఆసుపత్రి డాక్టర్లు పున:ర్జన్మ ఇచ్చినట్లు నడవలేని కూర్చోలేని ప్రాణాపాయ పరిస్థితులలో మెరుగైన నాణ్యమైన ఆపరేషన్ చేసి తనకు ప్రాణం పోసినట్లు తెలిపారు.అతని తండ్రి మాట్లాడుతూ..కొడుకుకు జరిగిన యాక్సిడెంట్లో కాలుకు జరిగిన తీవ్రమైన బలమైన గాయంకు అనేక ఆసుపత్రిలో తిరిగితే 30 లక్షల వరకు ఖర్చు అయినట్లు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కి వెళ్ళగానే ప్లాస్టిక్ సర్జన్ పి ప్రకాష్ తోపాటు ఆసుపత్రి వైద్యులు మంచిగా వైద్యం చేసి కేవలం 5 లక్షల ఖర్చుతో ఆయన కొడుకును రక్షించినట్లు ఆనందభాష్పాలతో తెలిపారు.ఆ కార్యక్రమంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పి.ప్రకాష్,ఆసుపత్రి అసిస్టెంట్ మేనేజర్ పాలకుర్తి నవీన్ కుమార్,ఆపరేషన్ కాబడిన పవన్ కుమార్,బాధితుని తండ్రి,బంధువు పాల్గొన్నారు.
Comments
Post a Comment