అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు
అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు
- అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వాచనాలు
- అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్,మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి సందేశం..
మంచిర్యాల న్యూస్,ఆగస్టు-28,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: వినాయక చవితి పండుగ నవ రాత్రోత్సవాల్లో భాగంగా గురువారం మొదటి రోజు దాదాపు 2000 వేల మందికి పైగానే అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం-ప్రోగ్రాం నిర్వహించారు.ఆ తరుణంలో రుచికరమైన భోజనాలు చేసిన ఇంకా తిన్న తర్వాత ప్రజలు,భక్తులు అన్నదాతా సుఖీభవ అంటూ ఆశీర్వాదములు మెండుగా అందించారు.ఆ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడారు.అన్ని దానాల్లో అన్న దానం చాలా గొప్పదని గుర్తు చేశారు.సామాజిక కార్యక్రమాలలో అంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.కాగా గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది.దాంతో అక్కడి జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే అన్నదానం నిర్వహించారు.ఆ విందు భోజనాలలో నోరూరించే హల్వా,జిలేబీ,చింతపండుతో చేసిన పులిహోర ఔరా అనిపించేలా వంకాయ మసాలా ఇంకో స్పెషల్ గా ఇక వెజ్ బిర్యానీ,పాలకూర పప్పు,మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ,సాంబార్,పెరుగు,టమాట,దోసకాయ చట్నీలు,పాపడాలు వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాల్లో మెనూ కనిపించాయి.ఆ వంటల విషయంలో అంజనీ పుత్ర సంస్థ ఎక్కడా తగ్గడంలేదు.అందుకు తగ్గట్టు భారీగా ఏర్పాట్లు చేసారు.చిన్న చిన్న గల్లీల్లో 1500 నుంచి 2000 మందికి భోజనాలు వడ్డించేందుకు ఏర్పాట్లు చేసారు.భక్తులకు కడుపునిండా వడ్డించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వడ్డించారు.జిల్లా వ్యాప్తంగా అంజనీ పుత్ర గణపతి మండపం గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా వసతులు కల్పిస్తున్నాయి.ఆ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేనీ కిషన్,కాసర్ల సదాందం,డైరెక్టర్లు,సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment