బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు నెలకొల్పింది
బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు
- సింగరేణి 55వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు భారీ ఎత్తున చేపట్టిన వైనం..
-- ఆర్కేపీ ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా వేడుకలు
- ముఖ్య అతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా
-- అధ్యక్షులు సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం...
- సింగరేణి వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు
- ఉన్నత అధికారులు-అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు
- ముందుగా ముఖ్యఅతిథి,సింగరేణి చైర్మన్ కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు
- సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు
-- సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం...
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ బొగ్గు
ఉత్పత్తి ఉత్పాదకత రక్షణలో ముందంజలో ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం సింగరేణి 55వ వార్షిక భద్రత పక్షోత్సవ వేడుకలు అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు.ఆ సందర్భంగా సింగరేణి సీ అండ్ ఎండి వేదికపై మాట్లాడారు.దానికి ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా మాట్లాడుతూ..సింగరేణి 1889లో ప్రారంభమైందనీ గుర్తు చేశారు.రక్షణలో ప్రస్తుతం జరిగిన మార్పుల గురించి వివరించారు.భారీ మిషనరీల ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెరిగిందన్నారు.రక్షణకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలనీ సూచించారు.అందరూ ఆరోగ్యంగా ఉండాలనీ సురక్షితంగా రక్షణతో ఉండాలని పిలుపునిచ్చారు.అనంతరం సింగరేణి చైర్మన్ ఎన్. బలరాం మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా రక్షణలో విజేతలు సాధించిన వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.బొగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి సంస్థ ముందంజలో ఉందని స్పష్టం చేశారు.ఆ రక్షణ చాలా విలువైందని తెలిపారు.అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.అండర్ గ్రౌండ్లో ప్రమాదాలు జరిగేటప్పుడు శబ్దం వస్తుందని అప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు.కార్మికులకు రక్షణ ముఖ్యమని ప్రాణాలను కాపాడుకోవాలి వివరించారు.ఆ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలినీ వెల్లడించారు. ముఖ్యంగా కొత్త గనులు రాకపోతే సింగరేణి మూతపడటం ఖాయమన్నారు.సింగరేణిలో కొత్త గనులు తీసుకురావాలన్నారు.ఒకే కుటుంబం ఒకే గమ్యం,ఒకే లక్ష్యం పేరు నినాదంతో సంస్థను కాపాడుకోవాలనీ కోరారు.ఈ దఫా100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు.అంతేకాకుండా సింగరేణిలో అధికారుల సమస్యలు పరిష్కారం అవుతాయనీ దసరా దీపావళి బోనాలు ఇస్తామణి బోగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని ప్రకటించారు.సింగరేణిలో అధికారుల సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నామని సింగరేణి ఒరిస్సాలో కూడా ఉందని తెలిపారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా సింగరేణినీ అభివృద్ధి చేయాలనీ దానికి ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.ముఖ్యంగా సింగరేణి కార్మికులు సంస్థకు బలమన్నారు.ఆ నేపథ్యంలోనే అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఆ తరుణంలో సుభాని మాజీ జిఎంను,రిటైర్డ్ డైరెక్టర్ సత్యనారాయణలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం చివరికి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో ఉన్న గనులు ఓపెన్ కాస్ట్లు వివిధ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఉద్యోగులకు రక్షణలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఆ వేడుకలలో సింగరేణికి సంబంధించిన పాటలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ బతుకమ్మ,బోనాలు,పోశమ్మకు సంబంధించిన పాటలతో మహిళలు నృత్యాలు చేయడంతో పాటు వేడుకలకు విచ్చేసి అందర్నీ ఆకర్షించారు.ఆ కార్యక్రమంలో సింగరేణికి సంబంధించిన ముగ్గురు డైరెక్టర్లు,జిఎంలు,కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ సీఎంఓ,ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య,ఐఎన్టియుసి జనక్ ప్రసాద్,ఉన్నతాధికారులు,అధికారులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు,సింగరేణి కార్మిక సంఘాల నాయకులు,కార్మికులు,మహిళా ఉద్యోగులు,తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment