మద్యం సేవిస్తూ జీవితంపై విరక్తితో సతీష్ ఆత్మహత్య
మద్యం సేవిస్తూ జీవితంపై విరక్తితో సతీష్ ఆత్మహత్య
-- ఆర్కేపి ఏఎస్ఐ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఏ-జూన్ ప్రాంతంలోని రాంనగర్ కు చెందిన చివరు శెట్టి సతీష్(40)అనే 108 అంబులెన్స్ డ్రైవర్ శుక్రవారం సొంత ఇంట్లోనే టవల్ తో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ క్రమంలో చూస్తే..భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడడంతో గత మూడు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నట్లు ఏఎస్ఐ వెంకన్న తెలిపారు.దాంతో ప్రతినిత్యం మద్యానికి బానిసై అనేకసార్లు చనిపోతానని చెప్పినట్లు పేర్కొన్నారు.ఆ నేపథ్యంలోనే ఒంటరితనం భరించలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆ మృతునికి భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని వివరించారు.
Comments
Post a Comment