ఆర్కేపి ప్రగతి కాలనీలో కలకలం సృష్టించిన తాడి జెర్రీ పాము
ఆర్కేపి ప్రగతి కాలనీలో కలకలం సృష్టించిన తాడి జెర్రీ పాము
-- తీవ్ర భవందోళనలకు గురి చేస్తున్న మరోసారి ఆ పాములు
-- స్నేక్ క్యాచర్స్ చాపిడి రాజేందర్ ఆ పామును చాక చక్యంగా పట్టుకున్నాడు
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ప్రగతి కాలనీలోని స్పెషల్ డి-59 అనే నెంబర్ గల క్వాటర్ లో గురువారం మధ్యాహ్నం చాలా పొడవుగా ఉన్న పెద్ద తాడి జెర్రీ పాము స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.ఆ క్రమంలో చూస్తే..వారం రోజుల క్రితమే ఆ క్వార్టర్ ప్రక్కన క్వాటర్ లోనే ఒక భారీ విష సర్పము గల కొండచిలువ సంచరించిన విషయం తెలిసిందే.ఆ కొండచిలువను రామకృష్ణాపూర్ లోని ఆర్కే-4 గడ్డ ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్స్ పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.ప్రధానంగా ఈరోజు కూడా చాలా పొడవుగా ఉన్న బలమైన తాడి జెర్రీ పాము అక్కడి ఇంట్లోకి రావడం చూసిన స్థానికులు తక్షణమే స్నేక్ క్యాచర్స్ కాబడిన శ్రీరాంపూర్ లోని ఆర్కే ఏడు గనిలో పనిచేసే సింగరేణి ఉద్యోగి కాబడిన చాపిడి రాజేందర్ కు సమాచారం అందించారు.దాంతో వెంటనే రాజేందర్ అక్కడి ఇంటికి చేరుకొని ఆ పామును చాలావరకు చాకచక్యంగా పట్టుకున్నాడు.ముఖ్యంగా వారం రోజులుగా అక్కడి ప్రదేశంలో పాములు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.అయితే అక్కడి ప్రదేశంలో ఏపుగా పెరిగిన చెట్లను కొంతవరకు ఇటీవల కాలంలో సంబంధిత అధికారుల ఆదేశాలతో లేబర్స్ తీసివేయడం వలన ఆ పోదల్లో ఉన్న పాములు కాస్తా ఒక్కొక్కటి అక్కడి ఇండ్లలోకి వస్తున్నట్లు స్థానిక ప్రజలు వాపోయారు.ఆ సందర్భంగా చాపిడి రాజేందర్ మాట్లాడుతూ..పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చీకటి సమయంలో ప్రస్తుత వర్షాకాలంలో బయటకు వెళ్లకుండా చుట్టుపక్కల చూస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.అలాగే పాములు ఎవరికైనా కనపడిన వెంటనే స్నేక్ క్యాచర్స్ కాబడినటువంటి చాపిడి రాజేందర్ లేదా కామెర రాజేందర్ అనే సింగరేణి ఉద్యోగులు కాబడిన వాళ్ళ యొక్క సెల్ నెంబర్లు 9 55 0 4 5 2 7 9 1అనే సొంత సెల్ నెంబర్కు వెంటనే కాల్ చేయాలని దాంతో 24/7 అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు.ఆ పట్టుకున్న తాడిజెర్రి పామును తీసుకువెళ్లి అడవిలో వదిలిపెట్టడం జరిగింది.
.
Comments
Post a Comment