ఆర్కేపిలో ఆర్ఎంపి క్లినిక్ లను తనిఖీలు చేసిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డా.యేగ్గేన శ్రీనివాస్
ఆర్కేపిలో ఆర్ఎంపి,పి.ఎం.పి క్లినిక్ లను తనిఖీలు చేసిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యేగ్గేన శ్రీనివాస్
-- ఆర్ఎంపి,పిఎంపిలు ప్రధమ చికిత్సలు మాత్రమే చేయాలని వార్నింగ్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-8,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యేగ్గెన శ్రీనివాస్ ఆకస్మికంగా ఆయన
పర్యటించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఆర్ఎంపి,పిఎంపిల యొక్క క్లినిక్ లను ఆయన ముమ్మరంగా తనిఖీలు చేశారు.ఆ నేపథ్యంలోనే సంబంధిత క్లినిక్ లో ఉన్న మందులు,ఇంజక్షన్లు,ల్యాబ్ లను పరిశీలించారు.ఆ సందర్భంగా డాక్టర్ యేగ్గేన శ్రీనివాస్ మాట్లాడారు.ముఖ్యంగా ఆర్ఎంపి,పిఎంపిలు ప్రధమ చికిత్సలు మాత్రమే చేయాలని సూచించారు.ఆ తరుణంలో అంతకుమించిన వైద్యం అసలు చేయరాదని ఆ విధంగా ఎవరైనా వాళ్ల యొక్క స్థాయికి మించిన వైద్యం చేస్తే..మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.అంతేకాకుండా వాళ్ళమీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని,ఇప్పటివరకు కొంతమంది అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవడంతో ఆ వ్యక్తులు కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నట్లు ప్రకటించారు.
Comments
Post a Comment