సున్నం బట్టి వాడ లైన్స్ భవనంలో రేపు ఉచిత నేత్ర శిక్షణ శిబిరం

సున్నం బట్టి వాడ లైన్స్ భవనంలో రేపు ఉచిత నేత్ర శిక్షణ శిబిరం 

-- మంచిర్యాల లైన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ 

మంచిర్యాల న్యూస్,ఆగస్టు-30,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : లైన్స్ క్లబ్ మంచిర్యాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల-31న ఆదివారం ఉదయం-10 గంటల నుంచి మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నారు.ఆ శిబిరంలో 50 సంవత్సరముల పైన వయస్సున్న వారికి కంటి జబ్బులతో బాధపడుతున్న వారు కంట్లో పొరలు వచ్చినవారు డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి కంటి చికిత్సకు ఎంపికైన వాళ్లను మరుసటి 1-9-2025 సోమవారం లైన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రేకుర్తి ఐ హాస్పిటల్ నిర్వాహకులు సమకూర్చిన బస్సులో ఉచిత బస్సు ప్రయాణము,భోజన సదుపాయము,వసతి,సమకూరుస్తూ కరీంనగర్ కు పంపిస్తారు.దాంతో ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు జరిపిస్తారు.అయితే ప్రజలు అట్టి మంచి అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు.ఆ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ లయన్ జి.శ్యాంసుందర్రావు,సెక్రెటరీ లయన్ కె.భాస్కర్ రెడ్డి,డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి,సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ వినయ్ కుమార్,లయన్ డాక్టర్ కే.సుగుణాకర్ రెడ్డి,లయన్ ఇరుకుల ఆనంద్,లయన్ గుండా శ్రీనివాస్,లయన్ సిరిపురం శ్రీనివాస్,లయన్ కే.సత్యపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి