గద్దెరాగడిలోని పద్మావతి కాలనీ ఇంట్లో దొంగల చోరీ
గద్దెరాగడిలోని పద్మావతి కాలనీ ఇంట్లో దొంగల చోరీ
-- 13 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు
-- బంగారం విలువ 2,86,000/-రూపాయలు
-- ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్
రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :భూపాలపల్లిలో సింగరేణి ఉద్యోగం చేస్తున్న మేకల రాజయ్య అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గద్దెరాగడిలో గల పద్మావతి కాలనీలో ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు.ఆ క్రమంలో చూస్తే..పట్టణ ఎస్ఐ జి.రాజశేఖర్ తెలిపిన కథనం ప్రకారం..8-8-2025 రోజున వరలక్ష్మి వ్రతం ఉన్నందున భూపాలపల్లి నుంచి కుటుంబ సమేతంగా మేకల రాజయ్య అతని కుటుంబం కొత్త ఇంటికి వచ్చి పూజలు చేసిన తర్వాత రాత్రి సుమారు 11:00 గంటలకు అందరు పడుకొని నిద్ర పోయినట్లు తెలిపారు.ఆ మరుసటి రోజు ఉదయం సుమారుగా 03:00 గంటలకు నిద్రలేచి చూసే సరికి ఆ ఇంటిలోని వస్తువులు దాదాపుగా చిందరవందరగా పడవేసి ఉన్నాయని వెల్లడించారు.కాగా నిద్రపోయే ముందు ఇంట్లోని వాళ్ల యొక్క బ్యాగులో పెట్టినటువంటి-13 తులాల బంగారు ఆభరణాలు కనపడలేదని వాటి విలువ 2,86,000/-వరకు ఉంటుందని ఆ బాధితుడు పిటీషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్ఐ వివరించారు.ముఖ్యంగా దొంగతనం విషయం తెలిసిన వెంటనే పోలీసు పైఅధికారుల ఉత్తర్వుల ప్రకారం ఆ దొంగలను పట్టుకునేందుకు అక్కడి సమీపంలో గల సిసి-కెమెరాలను పరిశీలించినట్లు ప్రకటించారు.ఆ నేపథ్యంలోనే పోలీసు సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసు తనిఖీలు డాగ్ స్క్వాడ్స్ జాగిలాలతో కూడా ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు.దాంతో త్వరలోనే ఆ దొంగలను పట్టుకొని తీరుతామని ఎస్ఐ తెలిపారు.ఆ విచారణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్,మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి,మందమర్రి ఎస్ఐ రాజశేఖర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment