ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ,వివిధ ఆసుపత్రుల అధికారులు,డాక్టర్లు బదిలీలు
ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ,వివిధ ఆసుపత్రుల అధికారులు,డాక్టర్లు బదిలీలు
- సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ..
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..
సింగరేణి కాలరీస్లోని ఏరియా ఆసుపత్రిలలో పనిచేస్తున్న డివై సీఎమ్ఓ,సంబంధిత అధికారులు,డాక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణపూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ పి.ప్రసన్నకుమార్ ఆర్ జి-1 ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు.అలాగే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి చెందిన డివై సీఎమ్ఓ డాక్టర్ ఏం.మధుకుమార్ ను రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి యాజమాన్యం బదిలీ చేసింది.అంతేకాకుండా మరి కొంతమంది వివిధ ఆసుపత్రిలో పనిచేస్తున్న అధికారులు డాక్టర్లను కూడా సింగరేణి యాజమాన్యం వేరే ఏరియాలలోని అక్కడి ఆసుపత్రులకు బదిలీలు చేసింది.ఆ నేపద్యంలోనే ట్రాన్స్ఫర్ కాబడిన అక్కడి హాస్పిటల్ లో వెంటనే రిపోర్టు చేయాలని సంబంధిత హెచ్ ఓ డి ఆదేశాలు జారీ చేసారు.
Comments
Post a Comment