సింగరేణిలో కార్మికులకు 34 శాతం లాభాల పంపిణీకి సిద్ధం
సింగరేణిలో కార్మికులకు 34 శాతం లాభాలు పంపిణీ
గోదావరిఖని ప్రతినిధి,సింగరేణి ప్రతినిధి,మంచిర్యాల,సెప్టెంబరు-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:సింగరేణి కంపెనీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.కాగా మొత్తం ₹2360 కోట్ల లాభాల్లో 34 శాతంను కార్మికులకు పంచాలని నిర్ణయించింది.ఆ ప్రకారం ₹802.4 కోట్లు శాశ్వత కార్మికులకు పంపిణీ చేయనున్నారు.ఒక్కో కార్మికునికి సగటున ₹1.95 లక్షలు అందనున్నాయి.ఆ నేపథ్యంలోనే కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేకంగా ₹5,500 చొప్పున ఇవ్వనున్నారు.అయితే పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులకు కలిపి సింగరేణి మొత్తం ₹819 కోట్లు చెల్లించనుంది.సింగరేణి చరిత్రలో ఇది మరోసారి కార్మికులకు ఆనందం నింపే లాభాల ప్రకటనగా నిలిచిందని తెలుస్తుంది.
Comments
Post a Comment