మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది


మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-











టీవీ మీడియా న్యూస్...

మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఆగింది.ఆ సందర్భంగా జెండా ఊపి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు వందే భారత రైలును అధికారికంగా లాంఛనంగా ప్రారంభించారు.ఆ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్,రాష్ట్ర మంత్రి వివేక్,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడారు.రైల్వే శాఖకు సింగరేణి ద్వారా పదివేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా,ఇక్కడి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.ఆ కృషి ఫలంగా వందే భారత్ హాల్టింగ్ సాధ్యమైందని గుర్తు చేశారు. అయితే వందే భారత్ హాల్టింగ్ కల్పించినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, రైల్వే శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి