కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు?

కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు?

ఆదిలాబాద్ జిల్లా న్యూస్, సెప్టెంబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: అదిలాబాద్ జిల్లాలో ఓక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..వీధి కుక్కల భారీ నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఎద్దు ఏకంగా ఓక ఇంటి పైకప్పు పైకి ఎక్కింది.అయితే మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనుకాడరు.ఆ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదుని నిరూపించింది.ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఆ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టాడు.అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి.దాంతో భయపడిన మూగ పశువు కాబడిన ఆ ఎద్దు ప్రాణ భయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు పెట్టింది.ఆ విధంగా పరుగెడుతూ..పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి,అక్కడి నుంచి నేరుగా ఓక ఇంటి పైకప్పు మీదకు చేరి ఆ ఎద్దు తన ప్రాణాలు కాపాడుకుంది.ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి చివరకు ఆ ఎద్దును కిందకు దించారు.ఆ ఇంటి పైకప్పు మీదకు ఎక్కడంతో ఇంటికి స్వల్పంగా నష్టం వాటిల్లింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి