ఆర్కేపిలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్

ఆర్కేపిలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్

-- కాంగ్రెస్ ఆఫీసులో మంత్రి సుదీర్ఘంగా చర్చలు 

-- క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం..

రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు.ఆ తరుణంలో రామకృష్ణపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టిన సమావేశంలో మంత్రి హాజరైనారు.ఆ నేపథ్యంలోనే స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు.చెన్నూరు నియోజకవర్గంతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని రంగాలలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.రోడ్లు డ్రైనేజీ స్మశాన వాటిక ఇంకా ముఖ్యమైన అభివృద్ధి పనులపై కలెక్టర్ తో మాట్లాడినట్లు గుర్తు చేశారు.గతంలో బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని కమిషన్ లకే ఎక్కువ అధికారం చూపెట్టినట్లు ప్రకటించారు.ఆ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,సంబంధిత అధికారులు,






స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాజు,పి.రఘునాథరెడ్డి,ఓడ్నాల శ్రీనివాస్,అబ్దుల్ అజీజ్,గాండ్ల సమ్మయ్య,స్థానిక నాయకులు,యువ నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి