తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి)గా తీన్మార్ మల్లన్న పార్టీ పేరు ప్రకటన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి)గా తీన్మార్ మల్లన్న పార్టీ పేరు ప్రకటన
తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ : జెండా, ఎజెండా ఇదే..!
తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్..
జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ న్యూస్ బుధవారం (2025, సెప్టెంబర్ 17) హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో పార్టీని ప్రకటించారు.పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గా ప్రకటించిన మల్లన్న..ఆ పార్టీ విధివిధానాలు,లక్ష్యాలు ప్రకటించారు.బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు మల్లన్న స్పష్టం చేశారు.తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు.బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు.
-- పార్టీ జెండా..అజెండా:
పార్టీ జెండాను ఎరుపు,ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు.జెండా మధ్యలో పడికిలి బిగించిన చేయితో పాటు..కార్మిక చక్రం,వరి కంకులతో జెండా రూపొందించారు.జెండా పై భాగంలో ఆత్మ గౌరవం,అధికారం,వాటా నినాదాలను పేర్కొన్నారు.అదే విధంగా పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేర్కొన్నారు.బీసీ మేధావి నారా గోని చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు.ఆకుపచ్చ రంగు అంటే రైతులు.. ఎర్ర రంగు అంటే పోరాటం అని ఈ సందర్భంగా ప్రకటించారు మల్లన్న.డిజైనర్ రాజేశం పార్టీ జెండాను రూపొందించినట్లు తెలిపారు.తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన పార్టీ ఆవిష్కరణ సభకు బీసీలు,వివిధ కుల సంఘాల నేతలు తరలి వచ్చారు.బీసీల రాజ్యాధికారం కోసం కలిసి రావాలని ఆ సందర్భంగా తీన్మా్ర్ మల్లన్న పిలుపునిచ్చారు.తెలంగాణలో 90 శాతం ఉన్న బీసీల రాజ్యాధికారం కోసం..బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ మల్లన్న.
-- బిఫాంలు అడుక్కునే పరిస్థితి ముగిసింది:
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఫాం లు అడుక్కునే పరిస్థితి ఈ రోజు నుంచి ముగిసిందని పార్టీ ఆవిష్కరణ సందర్భంగా మల్లన్న అన్నారు. సెప్టెంబర్ 17 కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని..పెరియార్ జయంతి,విశ్వ కర్మ జయంతి అయిన రోజున బీసీల తలరాత మరే రోజుగా పార్టీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.పార్టీ ప్రకటన అంటే బీసీ మేధావులని పిలిచి ప్రోగ్రాం నడపాలని కోరినట్లు తెలిపారు.బీసీలకు రాజకీయ పార్టీ అవసరం అని మేధావులు,బీసీల డిమాండ్ ఎప్పట్నుంచో ఉందన్నారు.పార్టీ అంటే పాన్ డబ్బా కాదు అని విమర్శించారని..కానీ బీసీల హక్కులు,రాజ్యాధికారం కోసం పార్టీ పెడుతున్నానని ఆ సందర్భంగా మల్లన్న అన్నారు.ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత ఏమీ చేయలేదని చెప్పండి..రాజీనామా చేస్తానని అన్నారు.బీసీల కోసం పోరాడుతున్నానని అంటేనే ఎమ్మెల్సీ గా ఉంటానని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు.అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను అసెంబ్లీ లో కూర్చునేల చేస్తానని ప్రకటించారు మల్లన్న.వెబ్ సైట్ ఆవిష్కరణ చేసిన సభకు వచ్చిన సాధారణ వ్యక్తి యాదగిరి ముదిరాజ్ అని మల్లన్న అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గా Artificial intelligence నియామకం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో తొలిసారిగా AI ని పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment