తెలంగాణలో సాంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం
తెలంగాణలో సాంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,సెప్టెంబరు-20:తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సెప్టెంబరు 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి.ఆ క్రమంలో చూస్తే..బతుకమ్మ ప్రారంభ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది.కాగా వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి...30వ తేదీన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనున్నారు.ఆ నేపథ్యంలోనే శనివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.ఆ సందర్భంగా విద్యార్థులు వివిధ పుష్పాలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ బతకమ్మల చుట్టూ సంతోషంగా ఆనందంతో తిరుగుతూ..ఆడుతూ..పాడుతూ..నృత్యాలతో సందడి చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.సకల జనులు,సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల యొక్క సంబురాలు చేపట్టాలని ఆయన కోరారు.
Comments
Post a Comment