ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి 

  
రామకృష్ణాపూర్ ఎస్ఐ జి.రాజశేఖర్

రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతికమైన,ఆర్థికపరమైన  సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ప్రజలను మభ్యపెట్టి,తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, లేదా సులభంగా లోన్లు ఇప్పిస్తామని, ప్రజలను నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను మోసం చేస్తున్నారు.తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ లో ఒక మహిళ ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్ల మోసానికి గురి అయ్యి తన ఖాతాలోని డబ్బు కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

--  వివరాల్లోకి వెళితే...

రామకృష్ణాపూర్లోనీ గద్దెరగాడిలో గల అమ్మాగార్డెన్ లో నివాసం ఉంటున్న మహిళ తన మొబైల్ లో తన Face book ఖాతాలో Work from Home అనే Part time job ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక గుర్తుతెలియని లింక్ చూసి, అది నిజమే అనీ నమ్మి ఆ లింక్ open చేసి అందులో Hotels కు సంబందించిన Reviwes ఉంటాయని వాటిని చేస్తూ కోన్ని Task లు కూడ చెయ్యాలని Task లు పూర్తి కాగానే డబ్బులు వస్తాయని చెప్పగా, సదరు మహిళ సైబర్ నేరగాళ్ళు చెప్పిన విధoగా చేస్తూ Task లు పూర్తి చేసినది.ఆ తరువాత వాళ్ళు Online Business లో డబ్బులు పెట్టుబడి (Invest) చేస్తే అధికమొత్తంలో లాభాలు వస్తాయని చెప్పగా, వారి మాటలు నమ్మి క్రమక్రమంగా, విడతలవారీగా డబ్బులు Onlineలో పంపించడం చేసింది, అవిదంగా వారి మాటలు నమ్మి సుమారుగా 5,00,000/- లక్షల రూపాయలు వరకు పంపిన తర్వాత ఆ మహిళ తన డబ్బులు Withdraw కోసం సైబర్ నేరగాళ్ళను అడగగా, టెలిగ్రామ్ యాప్ లో తన యొక్క Credit Score పడిపోయినదని నీ డబ్బులు తిరిగి రావాలంటే మరొక 5 లక్షల రూపాయలు Onlineలో Invest చేయాలనీ చెప్పగా, సదరు మహిళ తను మోసపోయానని గ్రహించి మొదటగా CYBER CRIME టోల్ ఫ్రీ నెంబర్ :-1930 కు call చేసి మొబైల్ ద్వారా పిర్యాదు చేసి, అతర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రాజశేఖర్ తెలిపారు.ఆ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ..సైబర్ నేరాల నుండి రక్షణ కోసం ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలను తెలిపారు.వ్యక్తిగత వివరాలు జాగ్రత్త:-  మీ వ్యక్తిగత వివరాలైన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఓటీపీ (OTP) వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఏ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ కూడా ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను అడగదు.అనుమానాస్పద లింక్‌లు, మెయిల్స్:- మీకు వచ్చే అనుమానాస్పద ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ లింక్‌లను క్లిక్ చేయవద్దు. అవి మోసపూరిత వెబ్‌సైట్‌లకు దారి తీయవచ్చు.ముందస్తు చెల్లింపులు:-లోన్, ఉద్యోగం, బహుమతి వంటి వాటి కోసం ఎవరైనా ముందస్తుగా డబ్బులు చెల్లించమని కోరితే,అది మోసమని అనుమానించండి. నిజమైన సంస్థలు ఎప్పుడూ ఇలాంటి వాటికి డబ్బులు అడగవు.ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు: ఏదైనా లోన్ లేదా ఆర్థిక లావాదేవీల కోసం అధికారిక, ప్రభుత్వ గుర్తింపు పొందిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి. వెబ్‌సైట్ అడ్రస్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. 'https'తో మొదలయ్యే వెబ్‌సైట్‌లు సురక్షితమైనవిగా భావించవచ్చు.తక్షణ చర్య:-ఒకవేళ మీరు మోసపోయారని తెలిస్తే, వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయండి లేదా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి