క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్
క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్
- ఆరు లక్షల నిధులతో కార్యాలయం నిర్మాణం
- రెండు కోట్ల రుణాల చెక్కును పంపిణీ చేసిన మంత్రి
- మంత్రి వివేక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం....
రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ప్రక్కనే ఉన్నా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన స్థలంలో సుమారు ఆరు లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన మెప్మా కార్యాలయాన్ని రాష్ట్ర కార్మిక,
గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి కొబ్బరికాయలు కొట్టి పెద్ద ఎత్తున చేపట్టిన ప్రోగ్రాంలో మహిళా భవన్-మెప్మా కార్యాలయాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఆ నేపథ్యంలోనే పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 567 మహిళా సంఘాలలోని సుమారు 6000 మంది సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ అక్కడి వేదికపై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా అభివర్ణించారు.స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళ సంఘాల కోసం 21 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్లు పేర్కొన్నారు.ఆ రుణాలతో ప్రతి ఇంట్లోని మహిళలకు ఆర్థిక భరోస కల్పిస్తూ,స్వశక్తితో వాళ్ల యొక్క ఇంటిని చెక్కపెట్టుకుంటున్నట్లు ప్రసంగించారు.ఆ తరుణంలో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు గుర్తు చేశారు.బేస్ మెంట్ వరకు కట్టిన ఇళ్లకు లక్ష రూపాయల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణానికి ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయలు,రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కొరకు 9000 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలిపారు.గత కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకంలో అవినీతికి పాల్పడుతూ లక్షల కోట్లు అక్రమంగా కమిషన్లకు పాల్పడినట్లు వెల్లడించారు.ఒక కాలేశ్వరం పథకంలోనే లక్ష కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం చేసినట్లు ప్రసంగించారు.గత కెసిఆర్ చేసిన అవినీతి పనుల వలన కాంగ్రెస్ ప్రభుత్వము 65 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకున్న అప్పులకు మిత్తి కడుతుందని వివరించారు.ప్రజలకు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతూ అభివృద్ధికి,మహిళా సంఘాలకు ఎటువంటి లోటులేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ మెప్మా విభాగం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 36 కొత్త మహిళా సంఘాలు ఏర్పడ్డయని,స్త్రీ నిధి ద్వారా 4.5 కోట్లు,వ్యక్తిగత రుణాల ద్వారా 27 లక్షలు,వీధి వ్యాపారుల పీఎం స్వానిది స్కీం ద్వారా 4.19 కోట్లు,బ్యాంకు లింకేజీ కింద 59 కోట్లు,వడ్డీలేని రుణాల కింద 1.62 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు.ఆ సమయంలో మెప్మా విభాగం ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మందమర్రి తాహాసిల్దారు సతీష్ కుమార్,పుర కమీషనర్ గద్దె రాజు,గ్రామీణ బ్యాంకు మేనేజర్,కాంగ్రెస్ పట్టణ ప్రెసిడెంట్ పల్లె రాజు,టీపీసీసీ మాజీ కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,పుర మాజీ చైర్మన్ జంగం కళ,పార్వతీ విజయ,
మాజీ వార్డ్ కాన్సిలర్లు,మెప్మా ప్రతినిధులు,మహిళా సంఘాల సభ్యులు,ప్రజలు,కాంగ్రెస్ పార్టీ,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం మెప్మా బృందం గ్రూపు మహిళలు అందరు కలిసి తెలంగాణలో ప్రత్యేకమైన పండుగగా చెప్పుకునే బతుకమ్మను ఆటపాటలతో సంతోషంగా ఆడారు.
Comments
Post a Comment