కృత్రిమ మేధా పరికరాలతో వినూత్నంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్

కృత్రిమ మేధా పరికరాలతో వినూత్నంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్

మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :కృత్రిమ మేధ పరికరాలు ఉపయోగించి వినూత్నంగా ప్రభుత్వ పాత మంచిర్యాల ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ బోధిస్తున్నాడు.ఆ క్రమంలో చూస్తే..ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత మంచిర్యాల యందు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతూ విద్యార్థులకు పాటల ద్వారా, స్టోరీల ద్వారా, కార్టూన్ ల ఇంగ్లీష్ సబ్జెక్టు చాలా సరళంగా, ఆకర్షణీయంగా బోధిస్తున్నాడు.  విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆసక్తితో వారు చెప్పిన పాఠాలను వింటున్నారు, సులభంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు.గత వేసవిలో జరిగిన ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలలో గణిత ఉపాధ్యాయులకు మరియు ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి ఇన్నోవేటివ్ గా విద్యార్థిని విద్యార్థులకు ఎలా బోధించవచ్చునో తెలియజేశారు.2015లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మరియు 2019 లో రాష్ట్రం ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.ఆ సందర్భంగా జర్నలిస్టు తెలుగు





దినపత్రికతో ఆయన యొక్క అనుభూతులను పంచుకున్నారు.పాత మంచిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న అడ్డిచర్ల సాగర్.రాష్ట్రంలోనే ఎవరూ వాడనంత అప్డేటెడ్ టెక్నాలజిని టి ఎల్ ఎమ్ గా వాడి బోధన చేయడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు.ఎంతో మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఫోన్ చేసి కృత్రిమ మేధ పరికరాలు వాడడం లో మెలకువలు తన వద్ద నేర్చుకుంటారని, సినీ పాటల రచయిత అక్కల చంద్రమౌళి కి కూడా పాటలు రికార్డింగ్ చేయడం నేర్పడం జరిగిందని,ఎండకాలం సెలవుల్లో ప్రభుత్వం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ పరికరాలు వాడి పాటలు రికార్డింగ్ చేసుకోవడం, కార్టూన్ స్టోరీలు క్రియేట్ చేసుకోవడం నేర్పడం జరిగిందని, అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి ఎండాకాలం సెలవులలో మిత్రులు నందిని కంప్యూటర్స్ యజమాని బండి కృష్ణ, ఎస్బిఐ ఆఫీసర్ కిరణ్ మరియు ఇతర మిత్రుల వద్ద సేకరించిన కంప్యూటర్ సిస్టములను "మై హోమ్ ఈజ్ మై కంప్యూటర్ ల్యాబ్"  " ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంటి వద్దకే కంప్యూటర్ విద్య" అనే పేరుతో విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అండాలమ్మకాలనీలో, పాత మంచిర్యాలలో, మేదరి వాడలో విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా కంప్యూటర్లను ఏర్పాటుచేసి, కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించడం జరిగిందని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలను వాడే విధానం నేర్పడం జరిగిందన్నారు.ప్రభుత్వం అవకాశం ఇస్తే కృత్రిమ మేధ పరికరాలను టి.ఎల్.ఎం.వలె వాడుకొని సులభంగా బోధన ఎలా చేయవచ్చో ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులకు క్లాసులు తీసుకుంటానని తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి