ఆర్కేపి గణేష్ శోభయాత్రకు మందమర్రి జిఎంను ఆహ్వానించిన గణేశ్ ఉత్సవ కమిటీ
ఆర్కేపి గణేష్ శోభయాత్రకు మందమర్రి జిఎంను ఆహ్వానించిన గణేశ్ ఉత్సవ కమిటీ
రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే గణనాథుడి శోభాయాత్రకు మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఆహ్వానించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని అనేక మండపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు ఆయా పురవీధుల గుండా శోభాయాత్రగా బయల్దేరి పట్టణంలోని రాజీవ్ చౌక్ నుంచి గోదావరి నదికి నిమజ్జనానికి బయల్దేరుతాడని జిఎంకు వివరించారు.అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిఎంను శాలువాతో గణేష్ కమిటీ బృందం సత్కరించారు.ఆ సందర్భంగా నవరాత్రులు భక్తుల నుంచి విశిష్ట పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను ఘనంగా శోభాయాత్రగా నిమజ్జనానికి తీసుకెళ్లాలని పట్టణంలోని వివిధ మండపాల నిర్వాహకులను కమిటీ సభ్యులు గాండ్ల సమ్మయ్య,పెద్దపల్లి ఉప్పలయ్య కోరారు.
Comments
Post a Comment