తెలంగాణ నిన్ను వదలను అంటున్న వానలు

తెలంగాణ నిన్ను వదలను అంటున్న వానలు

ఈ నెల 28 వరకు అతిభారీ వర్షాలు

-- ఆరెంజ్ అలెర్ట్‌ జారీ..

హైదరాబాద్ న్యూస్,అక్టోబర్ 24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: ఈ నెల 28 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆ క్రమంలో చూస్తే..వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉందని ప్రకటించింది.దాంతో ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది.గురువారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 26న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య,పశ్చిమ మధ్య బంగాళౠఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.27న ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది.వాయువ్య బంగాళాఖాతం,పశ్చిమ బెంగాల్‌ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లోనున్న అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా మీదుగా తెలంగాణ వరకు తక్కువ ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.ఈ సమయంలో తెలంగాణలో నాలుగు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి