ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చిన డివైసీఎమ్ఓ మధుకుమార్ కు గౌరవంగా సత్కారం
ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చిన డివైసీఎమ్ఓ మధుకుమార్ కు గౌరవంగా సత్కారం
- ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపిన ఆసుపత్రి ఉద్యోగులు
- శ్రీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు
రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలోగల రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ కు కొత్తగా బదిలీపై వచ్చిన డివైసీఎమ్ఓ డాక్టర్ మధుకుమార్ శుక్రవారం ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు.ఆ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఆసుపత్రిలోని డాక్టర్లు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు శాలువ కప్పి సత్కరించడంతో పాటు శుభాకాంక్షలు తెలిపి గౌరవంగా ఆహ్వానం పలికారు.ఆ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సీనియర్ పి
ఓ మదర్,పిఏ కృష్ణమూర్తి,ఆస్పత్రికి చెందిన డాక్టర్లు,మ్యాట్రిన్ టీవీ విజయలక్ష్మి,పుష్ప సిస్టర్ ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు,ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య,సీఐటీయూ ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్,భారత్ తిరుపతి,పనాస రమేష్,ఎలక్ట్రిషన్ జమదగ్ని,వార్డ్ అసిస్టెంట్స్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక కలువల శ్రీనివాస్,యూనియన్ నాయకులు,పారామెడికల్ సిబ్బంది,స్టాప్ నర్సులు,తరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment