ఆర్కేపి సిహెచ్పిలో రైలు ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి?
ఆర్కేపి సిహెచ్పిలో రైలు ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి?
- సిఐఎస్ఎఫ్ జవానులు,సింగరేణి ఎస్ అండ్ పిసి అధికారి ఎంక్వైరీ
రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీలో రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న సెంట్రల్ రైల్వే ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు ఇంజను అద్దాలు,మీటర్ అద్దాలు పగలగోట్టారు.ఆ క్రమంలో చూస్తే..సీఎస్పీలో నిలిచి ఉన్న సంబంధిత బొగ్గును తీసుకువెళ్లే గూడ్స్ రైలు ఇంజన్ యొక్క అద్దాలు అలాగే ఇంజన్ యొక్క మీటర్ కు సంబంధించిన అద్దాలు తదితర ఇంకా ఇంజన్ కు సంబంధించిన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు.ఆ విషయం తెలిసిన వెంటనే మందమర్రి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ శుక్రవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.దాంతో ఆ విషయమై జిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.ఆ విషయమై సిహెచ్పి ముఖ్య అధికారి బాలాజీ భగవత్ ఝాను జర్నలిస్టు పత్రిక-మీడియా న్యూస్ వివరాలు అడిగి తెలుసుకుంది.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కావాలని కొంతమంది వ్యక్తులు ఓర్వలేక కావాలని లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఇంకా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులైన కూడా ఆ రైలింజన్ అద్దాలు పగలగొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.ఆ విషయం సిఐఎస్ఎఫ్ పోలీసుతో పాటు మందమర్రి సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ మంచిర్యాల రైల్వే స్టేషన్ మాస్టర్ దృష్టికి వెళ్లినట్లు పేర్కొన్నారు.దాంతో ఆ రైలింజన్ పై దాడి ఎవరు చేశారో? తెలుసుకోవడానికి ఎంక్వయిరీ కూడా జరుగుతుందని సమాధానం ఇచ్చారు.సింగరేణి చరిత్రలో మొదటిసారిగా జరిగిన ఆ రైలింజన్ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...
Comments
Post a Comment