మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి

మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి.... 


- డీసీపీ భాస్కర్..

-కన్నుల పండువగా అంజనీపుత్ర గణనాథుని నవరాత్రుల వేడుకలు....

మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకలు సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా,శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని శుకార మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ వినాకయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం డీసీపీ ఆఫీసర్ ను అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి శాంతి,కుల మతాలకతీతంగా అందరూ ఐక్యతతో పండుగలో నిర్వహించుకోవాలన్నారు.తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతి పండుగను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు.అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ..వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని,వారి సహకారం,ఆశీర్వాద బలంతో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు.అనంతరం ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్,కాసర్ల సదానందం,డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి