ఆర్కేపిలో భక్తి శ్రద్ధలతో సంతోషంగా గణేష్ శోభయాత్ర సక్సెస్















ఆర్కేపిలో భక్తి శ్రద్ధలతో సంతోషంగా గణేష్ శోభయాత్ర

- ముఖ్య అతిథి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

- రాజీవ్ చౌక్ లో కొబ్బరికాయలు కొట్టి,మెమోంటోలు ప్రదానం..

- పట్టణ గణేశ్ ఉత్సవ కమిటీ బృందం

రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గణనాథుడి శోభయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సంతోషంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..బేల్లంపల్లి ఏసీపి రవికుమార్ ఆ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా ఏసిపి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజలు సుఖ:సంతోషాలతో జీవించాలని నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు రావాలని మంచిగా చదువుకున్న అభివృద్ధిలో వెళ్లాలని వినాయకుని కోరారు.ప్రధానంగా పట్టణంలోని అనేక మండపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరునీ ఆయా పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు.దాంతో పట్టణంలోని రాజీవ్ చౌక్ నుంచి గోదావరి నదికి గణేష్ నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు.ఆ నేపథ్యంలోనే నవరాత్రులు భక్తుల నుంచి విశిష్ట పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను బ్యాండ్ మేళాల మధ్య టపాకాయలు పెంచడంతో పాటు నృత్యాలు చేస్తూ..పట్టణంలో ఊరేగింపు చేశారు.అనంతరం భక్తి గేయలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా కోలాటాలతో నృత్యాలు చేస్తూ మహిళలు యువతీలు విద్యార్థినిలు నిర్వహించారు.ఆ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎసిపి రవికుమార్,మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్ఐ జి.రాజశేఖర్,ఎస్సై ఆంజనేయులు,క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గాండ్ల సమ్మయ్య,పెద్దపల్లి ఉప్పలయ్య,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు,పిసీసీ సెక్రెటరీ పి.రఘునాథ్ రెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,బిజెపి పట్టణ అధ్యక్షులు ధన్సింగ్,ఆరుముళ్ళ పోశం,బంగారు వేణు,కటకం నాగరాజు,గోపు రాజం,పి.కనకరాజు,వనం సత్యనారాయణ,పోలీసు సిబ్బంది,స్థానిక గణేష్ మండలి కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి