వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్?
వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,సెప్టెంబరు-8:ఎంటెరోమిక్స్ అని పిలవబడే ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్-పాథోజెనిక్ (హానికరం కాని)వైరస్‌లతో తయారుచేసారు.అవి క్యాన్సర్ కణాలను నేరుగా లక్ష్యంగా చేసి నాశనం చేస్తాయి.అంతే కాకుండా ఈ వైరస్‌లు రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి.అంటే రెండు రకాల పనులు చేస్తాయన్నమాట.ఒకటి ఆంకోలిసిస్ అనగా ట్యూమర్ ను నాశనం చేయడం.రెండు యాంటీ-ట్యూమర్ రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేయడం.కీమోథెరపీ లేదా రేడియేషన్‌కు భిన్నంగా,ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది.క్లినికల్ ట్రయల్స్‌లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ చూపలేదు.రోగులు దీనిని బాగా తట్టుకున్నారు.18-75 సంవత్సరాల వయస్సు గల 48 వాలంటీర్స్ తో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ మూడు నెలల క్రితం మొదలు పెట్టారు.సెప్టెంబర్ 6వ తేదీన ప్రిలిమినరీ డేటా రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేసారు.100% saftey profile కన్ఫర్మ్ అయింది. 60-80% ట్యూమర్ సైజ్ తగ్గింది.ఈ మొత్తం ట్రయల్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమో థెరపీ,రేడియేషన్ లాంటి ఇతర ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నవారు.ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్.ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.మిగిలిన క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొని వీలైనంత త్వరలో బయటకు వస్తుంది.బయటకు వచ్చాక ఈ వ్యాక్సిన్ ని రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ ఫ్రీగా ఇవాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Post a Comment