హరిత ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఒకేషనల్ కాలేజ్ ఫ్రెషర్స్ వేడుకలు

హరిత ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఒకేషనల్ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు




---------   ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాస్ ప్రసంగం

మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ఒకేషనల్ జూనియర్ కళాశాల-శ్రీ సాయి పారామెడికల్ ఫ్రెషర్స్ డే పార్టీ వేడుకలు గురువారం మంచిర్యాల పట్టణంలోని హరిత ఫంక్షన్ హాల్లో కన్నుల పండువగా ఘనంగా చూడ చక్కగా ఆనందమయంగా నిర్వహించారు.ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల నిర్వాహకులు,ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాస్ హాజరైనారు.ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.విద్యార్థులు క్రమశిక్షణతో పాటుగా పట్టుదలతో చదువుకుంటూ ఉన్నత శిఖరాలను అధిగమించాలని సూచించారు.విద్యతో పాటు వృత్తిలో నైపుణ్యంగా జీవితం ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరారు.ఆ పారామెడికల్ కళాశాలలో గత 18 సంవత్సరాల నుంచి చదివిన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్ రే టెక్నీషియన్ అనేస్తేసినా టెక్నిషన్ అప్తాల్ టెక్నిషియన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఇంకా వివిధ కోర్సుల్లో విద్యను అభ్యశించి ఎంతోమంది విద్యార్థులు ఇప్పటివరకు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడినట్లు వివరించారు.ఆ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీదేవి,అధ్యాపక బృందం శైలజ,స్వప్న,కళాశాల డైరెక్టర్ లు డాక్టర్ ఆదిత్య బాబు,డాక్టర్ సాయి కృష్ణ, మహాలక్ష్మి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి