సిఈఐఆర్ పోర్టల్ తో పోగొట్టుకున్న మొబైల్ కనిపెట్టి గంగులుకు అప్పగించిన ఆర్కేపి పోలీసులు
సిఈఐఆర్ పోర్టల్ తో పోగొట్టుకున్న మొబైల్ కనిపెట్టి గంగులుకు అప్పగించిన ఆర్కేపి పోలీసులు
- ఎస్ ఐ జి.రాజశేఖర్
రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : ఈ ఏడాది జూలై నెలలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనిపెట్టిన రామకృష్ణాపూర్ పోలీసులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్కేపి పట్టణానికి చెందిన పురుషోత్తం గంగులు యాదవ్ కు శనివారం అప్పగించారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలో నివాసం ఉండే పురుషోత్తం గంగులు యాదవ్(జర్నలిస్ట్)జూలై నెలలో అతని యొక్క ఓపిపిఓ -ఎఫ్-29(పిఆర్ ఓ)మొబైల్ కనపడటం లేదని,ప్రయాణం చేస్తున్నా సమయంలో ఎక్కడో పడిపోయినదని ఆన్లైన్ లో సీఈఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.ఆ ఫిర్యాదు ఆధారంగా అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా మొబైల్ యొక్క ప్రస్తుత స్థితిని,మొబైల్ ఉన్నటువంటి ప్రదేశాన్ని సీఐఆర్ ద్వారా పోలీసులు కనుక్కున్నారు.ఆ నేపథ్యంలోనే మొబైల్ ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దాంతో బాధితుడికి పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్.ఐ జి.రాజశేఖర్ అందించాడు.ఆ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ జంగు,కానిస్టేబుళ్లు ఓంకార్,అఖిల్ పాల్గొన్నారు.అతని ఇష్టమైన మొబైల్ అప్పగించిన పోలీసుల విధులు ఇంకా పోలీసుల యొక్క సేవలు పట్ల స్థానికులు పోలీసులకు గ్రేట్ గా సెల్యూట్ చేస్తున్నారు.
Comments
Post a Comment