తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అజీజ్ కు కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :లీడ్ ఇండియా నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రియతమ మాజీ రాష్ట్రపతి,భారతదేశ సైన్స్ పితా మహుడు అబ్దుల్ కలాం 94వ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాదులోని రవీంద్రభారతిలో బుధవారం కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రోగ్రాం భారీ ఎత్తున నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపుర్ పట్టణంలో గత 25 సంవత్సరాలుగా విద్యా రంగంలో ఆయన చేసిన నిస్వార్థ సేవలకు గాను తవక్కల్ విద్యా సంస్థల ఛైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ ఎంపిక అయ్యారు.దాంతో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అబ్దుల్ అజీజ్ కు ఘనంగా సత్కారంతోపాటు గౌరవంగా అవార్డు ప్రధానం చేసారు.ఆ సందర్భంగా తవక్కల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు,విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,అభిమానులు,స్నేహితులు,రాజకీయ నాయకులు,పుర:ప్రముఖులు,ఇతరులు అందరు కూడా అబ్దుల్ అజీజ్ కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment