రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ భీమా సుధాకర్ మృతి
రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ భీమా సుధాకర్ మృతి
రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రైస్ట్ స్స్కూల్ దగ్గర బుధవారం రాత్రి సుమారుగా 8:00 గంటలకు మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్లే నేషనల్ హైవే రోడ్డుపై బీమా సుధాకర్(65)అనే తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఊహించిన విధంగా మృతి చెందాడు.ఆ క్రమంలో చూస్తే..ఆయన యొక్క సొంత అపార్ట్మెంట్ లోని గణేష్ కిరాణం షాపు పని మీద వెళ్లినాడని ఆ పని ముగించుకొని తిరిగి అతని ద్విచక్ర వాహనం మీద ఇంటికి తిరిగి వస్తుండగా అదే సమయంలో మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న ఒక ఆటో దాని డ్రైవర్ అతివేగంగా,అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఆటోతో ఢీ కొట్టగా భీమా సుధాకర్ కింద పడిపోయినాడనీ రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.అయితే ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన వెంటనే అతని వరుసకు బాబాయ్ అయినటువంటి భీమా నగేష్ వచ్చి తన కారులో సుధాకర్ ను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.కాగా ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ పరిశీలించిన పిదప సుధాకర్ మరణించాడని నిర్ధారించినట్లు పేర్కొన్నారు.ఆ మృతుని బాబాయ్ కాబడిన భీమా నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Comments
Post a Comment